కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ.

శిశు గృహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ఆకస్మిక తనిఖీ చేశారు

0
TMedia (Telugu News) :

ఆరు సంవత్సరాలు ఉన్న చిన్నారుల సంరక్షణ కొరకు ఏర్పాటు చేయనున్న శిశు గృహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ భద్రాచలం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శిశు గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఏర్పాట్లు బాగున్నాయని అధికారులను అభినందించారు.

s s consultancy

Also Read:  బాలిక పై అత్యాచారంనేరస్థుని పై పీడీ యాక్ట్ అమలు.

తల్లిదండ్రులు వదిలివేయబడిన పిల్లలను ఈ సంరక్షణ గృహంలో సంరక్షణ చేస్తామని. పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకునేందుకు వీలుగా కారా చట్టం నియమ నిబంధనల ప్రకారం ఆన్లైన్ చేసుకోవాలని. ఆన్లైన్ లో వచ్చిన దరఖాస్తులను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమగ్ర విచారణ నిర్వహణ తదుపరి పిల్లలను ఈ శిశు గృహ ద్వారా దత్తత ఇవ్వడం జరుగుతుందని ఈ పక్రియ మొత్తం ఎంతో పాదదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని. దత్తత ఇచ్చిన పిల్లల యొక్క సంరక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని చెప్పారు. త్వరలో ప్రారంభించనున్న ఈ శిశుగృహం లో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని. ఈ కేంద్రంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి వరలక్ష్మి ,డిసిపిఓ హరికుమారి, సూపర్వైజర్ హాసిని తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.