కూలిన భీమిని ఎర్రవాగు వంతెన

0
TMedia (Telugu News) :

రాకపోకలకు ఆటంకం

s s consultancy

భీమిని మండల కేంద్రంలోని ఎర్రవాగు వంతెన శనివారం కొంత భాగం కూలిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతెన కింది భాగం లో కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ రహదారి మీదుగా బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ తదితర పట్టణాలకు రాకపోకలు సాగిస్తుం టారు. వంతెన వద్ద అధికారులు భద్రత సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో ప్రయా ణికులు ఇబ్బందులుపడ్డారు. ఈ వంతెన నిర్మాణానికి గతేడాది రూ.2 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అధికారులు, నాయకు లు చొరవచూపి ఎర్రవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.