పూర్తి అవుతున్న కొత్త కలెక్టరేట్ నిర్మాణం

0
TMedia (Telugu News) :
s s consultancy

పూర్తి అవుతున్న కొత్త కలెక్టరేట్ నిర్మాణం

టి మీడియా వనపర్తి జిల్లా 6 జూన్ : వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్నాయి. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష ప్రతి రెండు రోజులకు ఒక్క సారి పెబ్బేరు రోడ్డులో నిర్మాతమవుతున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో నిర్మాణం పనులు పరిశీలిస్తున్నారు.రూ.51.8 కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 95 శాతం పూర్తి అయింది. ఇంకా విద్యుత్ అలంకరణ రహదారుల నిర్మాణం పనులు,పూల మొక్కల అలంకరణ ఇతర పనులు ఉన్నాయి.కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మాట్లాడి ఈనెల 15 తేదీలోగా పూర్తి చేయాలని అదేశించారు. ఈ భవనం నిర్మాణం పూర్తి అయితే జిల్లా ప్రజలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.