ఎంపీ నామ నాగేశ్వరరావు గారి చొరవతో సీఎం సహాయనిధి చెక్కులు

0
TMedia (Telugu News) :

ఎంపీ నామ నాగేశ్వరరావు గారి చొరవతో సీఎం సహాయనిధి చెక్కులు

s s consultancy

టీమీడియా వైరా;
వైరా నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ 9,02,500/- లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు.
వైరా ఎమ్మెల్యే శ్రీ రాములు నాయక్ గారి క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత. ఆపత్కాలం లో సహాయాన్ని అందించిన ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
వైరా నియోజకవర్గంలోని వైరా, ఏన్కూరు మండలాల్లో పలు గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్య కారణాలతో వివిధ హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ హాస్పిటల్ లో వారికి అయిన ఖర్చులు ను తమ కుటుంబాల ఆర్దిక పరిస్థితులు దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి మంజూరు చేపించాలని ఖమ్మం లోని ఎంపీ నామ నాగేశ్వరరావు గారి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా వారి అభ్యర్థన మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు గారి సిఫార్సు తో మొత్తం 16 మంది లబ్ధిదారులకు రూ.9,02,500/- లక్షల రూపాయల విలువ గల చెక్కులు మంజూరు అయ్యాయి..అట్టి చెక్కులను ఎంపీ నామ నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు శనివారం నాడు వైరా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల వాణిని పార్లమెంట్ లో తన గళం తో గట్టిగా వినిపిస్తున్న ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి రాష్ట్ర ప్రజల ఆశీసులు ఎప్పుడు ఉంటాయన్నారు అలానే నామ నాగేశ్వరరావు గారు తమ ట్రస్ట్ నుండి ఎంతమంది నిరుపేద కుటుంబాల వారిని అదుకొని అండగా నిలిచిన విషయం గుర్తు చేశారు. జిల్లా ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే నాయకులు నామ నాగేశ్వరరావు గారని వారు పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అవసరమైన శానిటైజర్, మాస్కులు తో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 6 అత్యధునాతన అంబులెన్స్ లను అందించిన గొప్ప నాయకులు నామ నాగేశ్వరరావు గారు అని పలువురు పేర్కొన్నారు. అలానే ఆపత్కాలం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు సహాయాన్ని మంజూరు చేపించి చెక్కులను అందించిన ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ..కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ గారు, TRS వైరా మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి మోహన్ రావు గారు, జడ్పీటీసీ నంబూరి కనక దుర్గ గారు, ఎంపీపీ వేల్పుల పావని గారు, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్ గారు, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు గారు, AMC చైర్మన్ గుమ్మా రోశయ్య గారు,నాయకులు కట్టా కృష్ణార్జున రావు గారు, వనమా విశ్వేశ్వర రావు గారు, బాణాల వెంకటేశ్వర్లు గారు, ఏన్కూరు TRS మండల పార్టీ అధ్యక్షులు సురేష్ గారు, ఏన్కూరు మండల రైతు బంధు కన్వీనర్ ధర్మారావు అష్ణగుర్తి సర్పంచ్ ఇటికల మురళి గారు, కాపా మురళి కృష్ణ గారు, మిట్టపల్లి నాగేశ్వరరావు గారు, చల్లా సతీష్ గారు, అప్పం సురేష్ గారు, గారు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.