20 సిద్దిపేట,21న వరంగల్ లో కేసీఆర్ఆకస్మిక తనిఖీలు

0
TMedia (Telugu News) :

20 సిద్దిపేట,21న వరంగల్ లో కేసీఆర్ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి పనులు తనిఖీ ల్లో భాగంగా 20న సిద్దిపేట, 21 న వరంగల్ ల్లోపర్యటించనున్నారు.ఆదివారం ప్రగతిభవన్ లో జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం చేశారు.అదే రోజు వరంగల్ కొత్త కలెక్టరేట్ కొత్త భవనం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్ జైలు కూల్చే పనులు ముమ్మరం అయ్యాయి.అదే రోజు ఆక్కడ శంకుస్థాపన ఉండే విషయం పై స్పష్టత లేదు.

వైద్యం ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం :

s s consultancy

కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. ఇటీవలె 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.
వరంగల్లులో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను, 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సిఎం తెలిపారు. అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం దవాఖానా బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ ను నిర్మించాలన్నారు. కెనడామోడల్ లో,ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముండాలని, వైద్యాధికారులను సిఎం ఆదేశించారు. అందుకు కెనడా పర్యటించి రావాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.