రైల్వేకోడూరులోసి ఐ టి యు 51 వ వార్షికోత్సవం!కార్మిక రాజ్య స్థాపన లక్ష్యం.. జిల్లా కార్యదర్శి

0
TMedia (Telugu News) :

రైల్వేకోడూరులోసి ఐ టి యు 51 వ వార్షికోత్సవం!  కార్మిక రాజ్య స్థాపన  లక్ష్యం!! సిఐటియు జిల్లా కార్యదర్శి       సి హెచ్. చంద్రశేఖర్ పిలుపు!!!

s s consultancy

కడప జిల్లా రైల్వే కోడూరు లో, సీఐటీయూ 51 వార్షికోత్సవాన్ని ఎం డి ఓ ఆఫీసు వద్ద సీనియర్ కార్మిక నాయకుడు, యానాది జెండాను   ఆవిష్కరించారు.  సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి  సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర లో భాగంగా  కార్మిక వర్గం కీలక పాత్ర పోషించారు అన్నారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన  ఏ ఐ టి యు సి ఉమ్మడి కార్మిక సంఘం నాయకత్వం, స్వాతంత్రానంతరం, వర్గ సామరస్యం,  పెట్టుబడిదారి ప్రభుత్వానికి అనుకూలంగా,  యజమానులకు అనుకూలంగా, నిర్ణయాలు చేయడంతో,  సోషలిస్టు భావాలు కలిగిన, కార్మిక నాయకత్వం,  విభేదించడం జరిగినది.   వర్గపోరాటం, మిలిటెంట్ పోరాటం, కార్మిక రాజ్య స్థాపన, సోషలిజం కోసం, ఆర్థిక సమస్యలపై పరిమితం కాకుండా, రాజకీయ చైతన్యం తేవడం కోసం, జ్యోతిబసు నాయకత్వం, ఆహ్వాన సంఘం చైర్మన్ గాను,1970 మే 30 వ తేదీన కలకత్తాలో మహాసభలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సి ఐ టి యు ఏర్పడిందని, చెప్పారు.   అధ్యక్షులుగా బిటి రణదివే,  ప్రధాన కార్యదర్శిగా శ్రీ రామ్ మూర్తి మొదటి సారి ఎన్నికయ్యారు. మరుసటి రోజు 10 లక్షల మందితో బహిరంగ సభ జరిగిందన్నారు. ఐక్యత పోరాటం  నినాదంగా దేశంలో అతి పెద్ద కార్మిక సంఘం  గా గుర్తింపు  పొందింది అన్నారు. ఆర్థిక పోరాటాలే  కే పరిమితం   కావద్దని , రాజకీయ చైతన్యాన్ని అలవర్చుకోవాలని, పెట్టుబడిదారీ విధానానికి, భూస్వామ్య విధానానికి,  వ్యతిరేకంగా పోరాడాలని,  కార్మిక రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి  సోషలిజం ప్రత్యామ్నాయమని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించిన కార్మిక చట్టాలను, యాజమానులు అనుకూలంగా నాలుగు  కోడులు తెచ్చారని, కార్పొరేట్లకు అనుకూలంగా, వ్యవసాయ మూడు చట్టాల  చేశారన్నారు. దీన్నిబట్టి మనకు అర్థం అయ్యేది  ఇది పెట్టుబడిదారులకు, భూస్వాములకు వర్గ ప్రయోజనాలు కాపాడే పార్టీ అని  స్పష్టంగా ఉందన్నారు,  అన్ని రకాల ప్రభుత్వ సంస్థలను ప్రవేట్ పరం చేయడం,  ఉన్న సంస్థలను దివాలా తీయించడం, నిరుద్యోగాన్ని పెంచడం, పేదరికం పెరగడం, ఆర్థిక సంక్షోభాన్ని పెంచడం,  కార్మికుల మధ్య మతోన్మాద  చర్యలు చేపట్టి ఐక్యత విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయకుండా, కాలయాపన చేస్తోందని, సమాన పనికి సమాన వేతనం లేకుండా, దోపిడి చేస్తుందని ఆరోపించారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు, ఇసుక దోపిడీ వల్ల,  పేదలకు  ఇసుక అందుబాటులో లేదని, భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ రద్దు చేయాలని, కడప స్టీల్ ప్లాంట్   ప్రభుత్వమే  నిర్వహించాలని  ప్రత్యేక హోదా సాధించాలనే  వెనుకబడిన ప్రాంతాల  రాయలసీమ ప్యాకేజీ  కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.కరోనా ను అరికట్టడానికి లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనా అన్నారు, కరోనా   వ్యాక్షన్, కార్పొరేట్ ఆస్పత్రులకు అమ్ముకుంటూ లక్షల దండుకుంటున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రైవేట్ ఆస్పత్రిలో స్వాధీనం చేసుకొని, ప్రభుత్వమే నిర్వహించాలని,  ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని ,అందరికీ ఉచిత వైద్యం అందించే ప్రాణాలు  కాపాడాలన్నారు. , సి ఐ టి యు మండల కన్వీనర్, గంగాపూర్ సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో,   ప్రజాశక్తి , సీనియర్ నాయకులు, రమణ ,సిపిఎం నాయకులు లింగాల యానాదయ్య,  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు, ఎస్ చెన్నయ్య, జిల్లా నాయకులు  పంది కాళ్ళ మణి, సి ఐ టి యు పుల్లంపేట మండల కన్వీనర్ దార్ల నాగేశ్వరరావు,  ఓబులవారిపల్లె మండల కన్వీనర్  దార్ల సుధాకర్, చిట్వేల్ మండల  సిఐటియు నాయకులు, ఆర్ రమేష్, కోడూరు సిఐటియు  మండల నాయకులు, సుబ్రహ్మణ్యం రాజు, గ్రామ సేవకులు సంఘ నాయకులు, అధ్యక్షులు, కుమార్,  భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, చిన్న. ఆటో యూనియన్ నాయకులు, చిన్న. ఏపీఎండీసీ, త్రివేణి కార్మిక నాయకులు,  ఎం. శ్రీనివాసులు, శివ, కెవిపిఎస్  డివిజన్ కన్వీనర్.  ఓ బి లి. పెంచలయ్య,  డాక్టర్ పెంచలయ్య, నరసింహులు,  మల్లారపు గురయ్యా, ఉపాధి హామీ నాయకులు తుపాకుల హరిప్రసాద్, వెంకటసుబ్బయ్య, రైతు సంఘం నాయకులు,  వెంకట్ రెడ్డి, నరసింహ రాజు, డివైఎఫ్ఐ నాయకులు  మల్లారపు, కృష్ణయ్య, నాగరాజు.  తదితరులు పాల్గొన్నారు.

అభినందనలతో,
సి హెచ్ .చంద్రశేఖర్
సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.