బాలల సంరక్షణ కొరకు సహాయ కేంద్రం: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

0
TMedia (Telugu News) :

బాలల సంరక్షణ కొరకు సహాయ కేంద్రం: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

టీ మీడియా మే13
ములుగు జిల్లా ప్రతినిధి

s s consultancy

కరోనా రెండవ దశ నేపద్యంలో  బాలల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయక కేంద్రం – టోల్ ఫ్రీ నెంబర్ ను హైదరాబాదు కార్యాలయంలో ఏర్పటు చేయడం జరిగిందని,

ఈ సహాయక కేంద్రం ద్వారా Covid కు గురైన బాలలకు, కోవిడ్ సంరక్షణ కేంద్రం లో తల్లి దండ్రులు ఉండి, పిల్లల పోషణకు ఎవ్వరు లేని ఒంటరి బాలలకు లేదా పోషకులు కరోనా బారినపడి ఒంటరిగా ఉన్న బాలలకు, అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న బాలల కొరకు తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు మరియు ఇతర ఏ విధమైన సహాయం కొరకైనను ఈ ప్రత్యేక సహాయ కేంద్రం పని చేస్తుందని జిల్లా కలెక్టర్ గారు  ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ సహాయక కేంద్రం అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040-2 3 7 3 3665 నెంబర్ తో పని చేస్తుందని, అదేవిధంగా మహిళా 181 మరియు 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లను కూడా సంప్రదించి తద్వారా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి ఇ.పి. ప్రేమలత, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ శ్రీమతి కే స్వాతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి జే ఓంకార్ మరియు చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ బి ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.