నన్ను వాడుకొని మోసం చేశాడు

0
TMedia (Telugu News) :

నన్ను వాడుకొని మోసం చేశాడు…
న్యాయం చేయండి

s s consultancy

పోలీసులకు యువతి ఫిర్యాదు

కేసులు నమోదు చేసిన పోలీసులు

చదువుకుంటున్న టైమ్ లో ప్రేమిస్తున్నాని చెప్పి దగ్గరై తనను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రియుడు దబాయిస్తున్నాడని అడిగితే తక్కువ కులం (ఎస్సీ ) అమ్మాయి అని తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బుకాయిస్తున్నారని బాధిత యువతి ఆసిఫాబాద్  పోలీసులను ఆశ్రయించింది. ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామానికి చెందిన వైరగడే సమిత అనే యువతి సోమవారం ఆసిఫాబాద్  పోలీస్ స్టేషన్ లో తనను మోసగించిన రెబ్బెన మండలం గోలేటీకి గ్రామానికి చెందిన బోడసు శ్రీనివాస్ పైచర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. 2010 – 11సంవత్సరంలో హైదరాబాద్ లో  పరిచయమైన శ్రీనివాస్ శారీరకంగా ఎనిమిది సంవత్సరాల పాటు వాడుకొని ఇప్పుడు పెళ్లి వేరే అమ్మాయితో చేసుకుంటానని చెబుతున్నాడని తాను ప్రశ్నిస్తే దళితురాలివని చెబుతూ ఏం చేసుకుంటావో చేసుకో అని చెబుతున్నట్లుగా పిటిషన్లో పేర్కొంది. తనను వదిలించుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాడని ఈ నెల 11న శుక్రవారం బీజేపీ నాయకులు సొల్లు లక్ష్మీ, ఆత్మరాం నాయక్ లు తనకు శ్రీనివాస్ తో పెళ్లి చేయిస్తామని పిలిపించి, అక్కడ తనను భయపెట్టి బూతులు తిడుతూ తనకు రూ. 2 లక్షల నగదు ఇచ్చి బాండ్ పేపర్ పై బలవంతంగా సంతకం చేయించుకున్నారని దీనిపై ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని యువతి పోలీసులను కోరింది.బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోడసు శ్రీనివాస్, అతని తల్లిదండ్రులు బోడసు వీరమ్మ ,వేంకటి , యువతిని బెదిరింపులకు గురి చేసిన సోల్లు లక్ష్మీ, ఆత్మరామ్ నాయక్ లపై కేసు నమోదు చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.