కఠిన చర్యలు తప్పవు.సిఐ నారాయణ నాయక్.

0
TMedia (Telugu News) :

లాక్ డౌన్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు.సిఐ నారాయణ నాయక్.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి లక్షేట్టిపెట్, మంచిర్యాల జిల్లా.

లక్షెట్టిపేట పట్టణంలో కరోనా కట్టడి కై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన లాక్డౌన్ నిబంధనల ను ప్రజలందరూ తప్పకుండా పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని సిఐ నారాయణ నాయక్ హెచ్చరించారు. ఆయన కాలినడకన లక్షెట్టిపేట పాత బస్టాండ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు నడుస్తూ తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు ఎవరు రావొద్దని ఒకవేళ బయటకి రావాల్సి వస్తే లాక్ డౌన్ కి సంబందించిన సూచనలు తప్పకుండా పాటించాలి. కరోనా ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు.
పల్లెటూరు మొదలుకుని పట్టణం వరకు చిన్న చిన్న గల్లిలోని షాప్ లు ఏ ఒక్కటి కూడా తెరవొద్దని, ప్రభుత్వం విధించిన నిర్ణీత సమయంలోనే ఉదయం 6:00 గంటల నుండి 10:00 గంటల లోపే పనులన్నీ ముగించుకుని తమ ఇళ్లలోకి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్ణిత సమయం గడిచాక తిరుగుతున్న వాహనాల పై పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆయన వెంట ఎస్సై చంద్రశేఖర్, ట్రైనీ ఎస్సై హైమావతి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.