ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..కలెక్టర్

0
TMedia (Telugu News) :

ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

కొనుగోళ్ళలో వేగం పెంచి వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి

ధర్మారం, నిజామాబాద్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,మే 31:

s s consultancy

ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియలో వేగం పెంచి వారం రోజుల్లోగా కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు.

సోమవారం కలెక్టర్ కోనరావుపేట మండలం ధర్మారం, నిజామాబాద్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియను పరిశీలించారు.

ఇప్పటివరకు జిల్లాలో 2 లక్షల 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి అయిందని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించడంలో ఇబ్బందులు తలెత్తకుండా, జాప్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే రవాణా, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ధాన్యం తరలింపు వేగంగా జరిగేందుకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్ళలో వేగం పెంచి రాబోయే వారం రోజుల్లోగా కొనుగోళ్ళ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ తనిఖీలో కలెక్టర్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ వహీదొద్దీన్, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.