అధిక ధరలకు అమ్మితే చర్యలు

0
TMedia (Telugu News) :
s s consultancy

అధిక ధరలకు అమ్మితే చర్యలు
-పేట ఎస్ఐ నరేందర్
టీ మీడియా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట (మే 23):
కరోనా నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయించి ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ నరేందర్ అన్నారు .ఎవరైనా వ్యాపారులు నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు భాగంగా 161జాతీయ రహదారి పైన ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు.నిబంధనలను ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలను జప్తు చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కి ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు .ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై నరేందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.