కృష్ణా, గోదావరి జలాల పై కేంద్ర పెత్తనం అత్యంత ప్రమాదకరము

ఖమ్మం: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు ద్వారా పరిష్కారం చేసుకోవాలి

0
TMedia (Telugu News) :

ఖమ్మం
రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు మధ్య తలెత్తిన కృష్ణా జలాల వివాదం అసర చేసుకుని కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల పై పెత్తనం చేయుటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరావు అన్నారు.

Also Read:చెరువుకట్టను పరిశీలించిన అఖిలపక్షం

s s consultancy

శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగిన కృష్ణా నది నీటి వినియోగం–పెండింగ్ ప్రాజెక్టులు అనే అంశంపై తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ కృష్ణా జలాల పంపిణీ లో తలెత్తిన వివాదాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు ద్వారా సామరస్యం గా పరిష్కారం చేసుకోవాలని అన్నారు, కృష్ణా జలాల వివాదం కేంద్ర ప్రభుత్వం జోక్యం తో మరింత ఇబ్బందులు ఏర్పడతాయి అని అన్నారు, రాజకీయ ఆధిపత్యం కోసం కాకుండా శాస్త్రీయ కోణం లో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపాలని డిమాండ్ చేశారు, 1976 సంవత్సరం లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు, మిగులు జలాలపై ఏర్పడినబ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య కూడా నీటి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని అలాకాకుండా సంవత్సరాల గా కాలం గడపటం వల్ల వివాదం పెరిగింది అని అన్నారు.

Also Read:బైల ప్రకారం సొసైటీ కార్యకలాపాలు:ఏలూరి

తెలంగాణ రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కృష్ణా జలాల పంపిణీ లో తలెత్తిన సమస్య ఖమ్మం జిల్లాలో ఉన్న సాగర్ ఆయకట్టు పై తీవ్ర ప్రభావం చూపుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు రాయల చంద్ర శేఖర్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శేఖర్ గౌడ్, టిజెఎస్ జిల్లా కార్యదర్శి వర్థబోయిన బాబు ప్రసంగించారు, కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మేరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, ఎస్ కె మీరా, తుమ్మల శ్రీనివాస్ రావు,అవుల వెంకటేశ్వర్లు ,బండారు రమేష్, మేకల నాగేశ్వరావు, పి సంగయ్య, , మధు, రాయల శ్రీనివాస్ రావు,ప్రతాపనేని వెంకటేశ్వరావు , పి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.