నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు

0
TMedia (Telugu News) :

నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు

s s consultancy

సమావేశానికి గైర్హాజరైన పలువురు డీలర్లు…?

వేంసూర్

మండలం లోని పురుగు మందులు, ఎరువులు, విత్తన అమ్మకాల డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని ట్రైనీ ఎస్సై సోనియా, వ్యవసాయ అధికారి రామ్మోహన్ తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా కలసి పని చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రత్యేక తనిఖీ బృందాలు నిరంతరం షాపులను పరిశీలించడం జరుగుతుందని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలను తయారుచేసి మన రాష్ట్రంలో అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు పని చేస్తున్నట్లు తెలిపారు. రైతులు విత్తనాలను కొత్త వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను నమ్మి కొనుగోలు చేయరాదని కోరారు. వ్యవసాయశాఖ ధ్రువీకరించిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయన్న విషయం తెలిసేలా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు మేలు కలిగించేందుకే నకిలీ విత్తనాలతో పాటు నకిలీ పురుగు మందుల విక్రయాలను నిఘా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. నకిలీ విత్తనాలు నియంత్రణకు వ్యవసాయ శాఖ కు కావలసిన అవసరమైన సహకారాన్ని స్ధానిక పోలీస్ అధికారులు అందిస్తారని , నకిలీ చేసే వ్యాపారస్తులకు చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. గడువు తీరిన, నాసిరకం విత్తనాలు డీలర్లు అమ్మకాలు సాగించ వద్దని హెచ్చరించారు. విత్తనాలు పురుగు మందులు ఎరువులు అమ్మకాలపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరువద్దని అన్నారు. ప్రతి ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాల స్టాక్ రిజిస్ట్రర్లు, ఎరువులు, పురుగుల మందుల స్టాక్ వివరాలతో పాటు ఆయా కంపెనీల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. విత్తనాలు , ఎరువులు ఎక్కడ నుండి దిగుమతి చేస్తున్నారనేది తప్పనిసరిగా సంబంధిత రసీదులు, ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల ఎరువులు పురుగు మందులు విత్తనాల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.