నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్

0
TMedia (Telugu News) :

మీడియా/నిర్మల్ జిల్లా/
తేదీ: 14-05-2021మే

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది: జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్

s s consultancy

లాక్ డౌన్ మూడవ రోజు సందర్భంగా జిల్లా ఎస్పీ గారు నిర్మల్ పట్టణంలో బుధవార్ పేట్ చౌరస్తా, గాంధీ చౌక్, మార్కెట్ మసిద్, కమల్ టాకీస్ ఎక్స్ రోడ్, సలీం మసిద్, కూరగాయల మార్కెట్, కలెక్టర్ చౌక్, ఈద్గా చౌరస్తా, మంచిర్యాల్ తదితర ప్రదేశాలను కాలినడకతో సందర్శించి అమలు తీరును పర్యవేక్షణ చేసి, పటిష్టమైన బందోబస్తు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎస్పీ గారు వాహనాల తనిఖీ చేసి హెల్మెట్, సరైన దృవపత్రాలు లేని వాహనాలపై తగు చర్యకు ఆదేశించారు. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్ డౌన్.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి, రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాంరెడ్డి, పట్టణ సిఐ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.