పెళ్లి వారిపై కేసు నమోదు

0
TMedia (Telugu News) :

పెళ్లి వారిపై కేసు నమోదు

s s consultancy

పెద్దపల్లి జిల్లా,జూన్ 5

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు పెళ్లిళ్లు చేసినా,పెళ్లికి వెళ్లినా,ఇతర ఏ పంక్షన్లకు వెళ్లిన నియమ నిబంధనలు లాక్ డౌన్ నియమాలు పాటించాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత కార్యక్రమాల పై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని 1 టౌన్ సిఐ రమేష్ బాబు అన్నారు. గోదావరిఖని ఐబీ కాలనిలో జరిగిన ఓ శారీ పంక్షన్లో మరియు విట్టల్ నగర్ లో జరిగిన పెళ్ళిల్లో ఏ ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో ఎస్సై ప్రవీణ్ కుమార్ వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. పెళ్లి జరిగే ప్రాంతంలో ఇంటి పెద్దలు తల్లిదండ్రులతో సహ మొత్తం 40 మందికి మించి ఉండకూడదు. శుభకార్యాలకి హాజరైయ్యే ప్రతి ఒక్కరు మాస్క్ కచ్చితంగా వేసుకోవాలి, ఫోటోలకు కోసం మాస్క్ లు తియ్యకూడదని పోలీసులకి ప్రజలు సహకరించాలని వన్ టౌన్ సిఐ కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.