ఉద్యోగాలు ఇస్తానని…మరో రకం సైబర్ క్రైం

0
TMedia (Telugu News) :

హైదరాబాద్‌లో

s s consultancy

ఓ వ్యక్తి మరో రకం సైబర్ మోసానికి పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను నమ్మించి మోసం చేశాడు. ఒక్కొక్కళ్ల దగ్గర లక్షలు వసూలు చేసి మొహం చాటేశాడు. చివరికి బీటెక్ పూర్తి చేసిన ఆ యువకులు మోసపోయామని తెలుసుకొని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్‌ పూర్తి చేసిన పలువురు యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. మంచి కంపెనీల్లో వేకేన్సీల కోసం గూగూల్‌‌లో సెర్చ్ చేయగా.. ఓ సంస్థకు చెందిన నంబర్‌ కనిపించింది. దానికి ఫోన్‌ చేయగా.. ‘‘మాదాపూర్‌లో కొత్తగా ‘లిమిటెక్స్‌’ పేరుతో పెద్ద కంపెనీ పెట్టా. నేనే సీఈఓ.ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంటున్నా. ఆసక్తి ఉంటే రెజ్యూమ్‌లు పంపండి’’ అని అవతలి వ్యక్తి సమాధానం చెప్పాడు. నమ్మిన సుమారు 35 నుంచి 40 మంది తమ రెజ్యూమ్‌లు పంపారు. ఉద్యోగం రావాలంటే ముందుగా కొంత డబ్బు చెల్లించాలనడంతో వారు ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా ఒక్కొక్కరు రూ.లక్ష, నుంచి రూ.3 లక్షల వరకూ సమర్పించుకున్నారు. మొత్తం వారి నుంచి రూ.27 లక్షల 30 వేలు వసూలు చేశాడు.

ఆ తర్వాత నుంచి ఆ ఫోన్‌ నెంబరు స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయానని యువకులు గుర్తించారు. వీరిలో అల్వాల్‌కు చెందిన బుచ్చిరాములు సోమవారం సైబర్‌ క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. తనలాగా ఎవరైనా బాధితులు ఉన్నారా ఆరా తీయగా 40 మంది వరకూ ఉన్నట్లు తేలింది. వీరితో పాటు మరింత కొంత మంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సైబర్‌క్రైం పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.