ప్రజాస్వామ్య వ్యవస్థ దార్షనికుడు మహత్మా బసవేశ్వరుడు

0
TMedia (Telugu News) :
s s consultancy

ప్రజాస్వామ్య వ్యవస్థ దార్షనికుడు మహత్మా బసవేశ్వరుడు……………….వీర శైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాపురే అశోక్

ఆదిలాబాద్ జిల్లా:/మే(14)అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహత్మా బసవేశ్వర 888వ జయంతి వేడుకలు వీరశైవ లింగాయత్ ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.. కరోనా జాగ్రత్తలను అనుసరిస్తు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు..బసవేశ్వర విగ్రహం వద్ద పూల మాలలు వేసి నివాలులర్పించారు.. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరశైవ లింగాయత్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముస్తపురే అశోక్ మాట్లాడుతూ…… 8 శతాబ్ధాల క్రితమే పార్లమెంటరీ వ్యవస్థ ను ప్రారంభించిన… దార్షనికుడు మహత్మా బసవేశ్వరుడని…. ఆ సమయంలో బడుగు,బలహీన,అణగారిన వర్గాల కొరకు రిజర్వేషన్ లను ప్రారంభించారని…. ఇప్పుడు ఆయా దేశాలలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ను ముందు చూపుతో …..ఆయన అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ ను రూపకల్పన చేశారని తెలిపారు.. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా ఆయన ఖ్యాతిని గుర్తుచేయడం పట్ల వీర శైవులకు గర్వకారణమని తెలిపారు… ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, లింగ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు వెండి భద్రేశ్వర్ రావ్ , తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి మరియు అన్నదానం శివప్రసాద్, జగదీశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.