సంచలనాత్మక బొమ్మనపల్లి నవ వధువు హత్యకేసును 30గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు

0
TMedia (Telugu News) :

కట్టుకున్న భర్త మానవమృగంగా మారి హతమార్చాడు
టి మీడియా// కరీంనగర్ జిల్లా
ఈనెల 23న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో మిస్టరీగా మారిన నవ వధువు మ్యాదర ప్రణాళిక అలియాస్ గరిగె ప్రణాళిక (21) హత్య కేసును పోలీసులు సునిశిత పరిశీలన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఛేదించారు. వివాహమై రెండు నెలలు గడువముందే అనుమానమే పెనుభూతమై, ఆమెకన్నా తక్కువ చదువుకున్నాననే ఆత్మనూత్యన్యభావం అన్నీ తోడై మానవమృగంగా మారి ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత దారుణంగా హత్యచేశాడు.ఈ హత్య సంఘటనకు దోపిడీకి పాల్పడిన దొంగలు హత్యచేసిన విధంగా చిత్రీకరించాడు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

s s consultancy

చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనీల్(26) కు హుజురాబాద్ కు చెందిన గరిగె ప్రణాళిక అలియాస్ మ్యాదర ప్రణాళికతో రెండునెలల క్రితం వివాహం జరిగింది. భార్యతనకన్నా ఎక్కవ చదువుకుందనే ఆత్మనూన్యతభావం, అన్నివేళల్లో తనకు అనువుగా ఉండటం లేదని, తల్లిదండ్రులు, ఆమెతోపాటు చదువుకున్న స్నేహితులతో తరచూ ఫోన్లో మాట్లాడడాన్ని చూసి ఎవరితోనో మాట్లాడుతుందని అనుమానం పెంచుకుని తనతో శారీరకంగా సఖ్యత చూపడంలేదని,జీర్ణించుకోలేక, మానవమృ మృతురాలు ప్రణాళిక బాసరలో ట్రిపుల్ ఐఐటి చదువుకుంటోంది. ఆమెతండ్రి లారీ డ్రైవర్ మారాడు. గా పనిచేస్తున్నాడు. బీదకుంటుంబం కావడంతో కొంత బతుకుదెరువు ఉన్న కుటుబాన్ని చూసి పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని బొమ్మనపల్లికి చెందిన అనీల్‌తో వివాహం చేశారు.నిందితుడు అనీల్ హుస్నాబాద్‌లో బ్యాటరీ రిపేరింగ్ చేసే దుకాణాన్ని నడుపుకుండున్నాడు. నవ వధులు ప్రణాళిక ఆషాడమాసంరాకతో పుట్టింటికి హుజురాబాద్‌కు అత్తమామ, భర్త అంగీకారంతో వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిన ప్రణాళికను నచ్చజెప్పి తనతనల్లికి జ్వరం వచ్చిందని, తనతోపాటు బొమ్మనపల్లికి వచ్చేలా జూలై 18న బొమ్మనపల్లికి తీసువచ్చాడు.హత్యకు కుట్ర, దోపిడి దొంగలు హత్యచేసినట్లుగా చిత్రీకరణ ఈనెల 23న భార్య ప్రణాళికను హత్యచేయాలని నిర్ణయించుకున్న నిందితుడు అనీల్ హత్యకు ఒకరోజు ముందు కత్తిని హుస్నాబాద్‌లో కొనుగోలు చేశాడు. ఇంట్లో తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రతిరోజు లాగే ఈనెల 23న తన బైక్‌పై హుస్నాబాద్‌లోని తన బ్యాటరీ రిపేరింగాపుకు వెళ్ళాడు. ఇంతలో 11 గంటల సమయంలో అనీల్ స్నేహితుడు ఒకతను వచ్చి తన పల్సర్ కన్ను అనీల్ షాపువద్ద ఉంచి సాయంత్రం వచ్చి తీసుకుంటాను. పనిమీద బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు.ఇదే అదునుగా భావించి బ్యాటరీషాపులో మెకానిక్‌లు వాడే చమురు పదార్థాలు అంటిన డ్రెస్‌ను ధరించి అతడి స్నేహితుడు తనషాపవద్ద ఉంచిన పల్సర్. మీద ఎవరికీ అనుమానం రాకుండా బొమ్మనపల్లికి వచ్చాడు. ఇంటికి వెళ్ళే సరికి తనభార్య ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ తను వెళ్ళగానే మళ్ళీ చేస్తానని, ఫోన్ కట్ చేసిందని, ఇంకా తనను ఇలా ముందుగానే ఏమైనా పనిమీద వచ్చావని అడగడంతో ఉన్న అనుమానం రెట్టింపైందని, తనతో కొద్దిగా పనిఉండి రావాల్సివచ్చిందని సమాధానం ఇచ్చాడు. భార్యప్రణాళిక ఇంట్లోని మంచంపై బోర్లాపడుకుని తనతో మాట్లాడుకుండా సెల్‌ఫోన్ చూస్తుండగా భర్తఅనీల్ అమెపక్కన కూర్చిని ) టివి ఆన్‌చేసి(ఒకవేళ అరిస్తే చప్పుడు బయటకు వినిపించకుండా),పక్కరూంలోకి వెళ్ళి నీళ్ళుతాగి అంతకుముందే హుస్నాబాద్‌లో కొనుగోలు చేసి తనతో తెచ్చుకున్న కత్తితో మంచంపై బోర్లా పడుకున్న ప్రణాళిక వీపుమీద కూర్చుని జుట్టుపట్టి మెడను కత్తితో నరికాడు. వెంటనే ఆమె ప్రతిఘటించడంతో మరలా మరోవేటువేసి నరికాడు. ఇద్దరూ కిందపడ్డారు. పక్కరూంలో ఉన్న గొడ్డలితో మరలా క్రూరంగా నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరని అనీల్ తల్లిదండ్రులు వ్యవసాయపనులకు పోతారని, అనీల్ ఆ సమయాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పాడు. చుట్టుపక్కల వారుకూడా ఎవరూ లేకపోవడంతో ఆయుధాలకు అంటిన రక్తం మరకలను చూడిచి కడుగడంతోపాటు ఈ హత్యను కొందరి దోపిడి దొంగలు ఆభరణాలకోసం వచ్చి దొంగిలించి హత్యచేసినట్లుగా చిత్రీకరించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని వెంటనే హుస్నాబాద్ వెళ్ళిపోయాడు.స్వాధీనం చేసుకున్న ఆయుధాలు సోమవారం ఉదయం హంతకుడిని అరెస్ట్ చేసి అతని వద్దనుండి హత్యకు వాడిన ఒకగొడ్డలి, కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.తాను నిందిడిని కాదని తప్పించుకునేందుకు జిమ్మిక్కులు భార్యహత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అందరూ నమ్మేవిధంగా దోపిడిదొంగలు హత్యచేసినట్లు నేరస్థలాన్ని చిత్రీకరించి తన మిత్రుడి పల్సర్‌ను వాడి హత్యచేసిన వెంటనే హుస్నాబాద్‌కు వెళ్ళి ఒక బట్టలషాపులో కొత్తప్యాంట్ తీసుకుని రక్తం మరకలు అంటిన ప్యాంట్‌ను టీషర్టును, హత్యకు వాడిన కత్తిని ఒక కవర్లో పెట్టి మడద గ్రామం చెరువు కట్టవద్ద దాచిపెట్టాడు.హత్యకు వాడిన మరో ఆయుధం గొడ్డలిని తన ఇంటి వెనుకాల మెట్లకింద దాచిపెట్టాడు.యధావిధిగా తనషాపక్కు వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా తనపని తను చేసుకుంటున్నాడు. ఇదేగ్రామానికి చెందిన మరోస్నేహితుడు హస్నాబాద్లోనే సెల్‌ఫోన్ రిపేంరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తాడు.ఆరోజు మధ్యాహ్నం అతడితో కలిసి తన మనసు బాగా లేదని చెప్పి హుస్నాబాద్ శివారులో మద్యం సేవిస్తారు.సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికివచ్చిన తనతల్లి ఫోన్‌చేసి తనభార్య ప్రణాళిక రక్తపు మడుగులో పడి ఉందని చెప్పగా వెంటనే తన స్నేహితుడు శ్రీకాంత్‌కు ఫోన్‌చేసి ఇద్దరూ కలిసి బొమ్మనపల్లికి బయలుదేరుతారు.తనమిత్రుడు శ్రీకాంత్ డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు.నేరాలకు పాల్పడిన వారు తప్పించుకోలేరు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి బొమ్మనపల్లిలో జరిగిన నవ వధువు హత్యసంఘటనను పోలీసులు సవాల్‌గా తీసుకుని 30గంటల వ్యవధిలో ఛేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు.హత్య జరిగిన సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించిన సిపిగారు,వెంటనే ఏఎస్పి రీతిరాజ్,కరీంనగర్
రూరల్ ఏసిపి విజయసారధి,కె శ్రీనివాస్(సిసిఎస్), తిమ్మాపూర్ సిఐ శశిధర్‌రెడ్డి,టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు. మల్లయ్య,సృజన్‌రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి రవి, చిగురుమామిడి, ఎలండి ఎస్ఐలతో ప్రత్యేక బృందాలన
ఏర్పాటు చేయడం జరిగింది.సంఘటన స్థలాన్ని సునిశితంగా పరిశీలించడం,సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో కేసును చేధించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంఘటన ఛేదనలో కీలకపాత్ర పోషించిన అన్నిస్థాయిలకు చెందిన పోలీసులకు రివార్డులను ప్రకటించారు.

police have cracked the murder case of a newly-wed mother- in -law alais Garige plan (21) , who has become a mystery in Bommanpally, Chigurumandi zone, on may23.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.