ఉపాధి హామీ సిబ్బంది నల్ల బ్యడ్జీతో నిరసన

టీ మీడియా ప్రతినిధి జన్నారం,మంచిర్యాల జిల్లా:

0
TMedia (Telugu News) :

నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం లో ఉపాది హామీ పథకం లో సాంకేతిక సహయకుడిగా పని చేస్తున్న రాజు పై సాంబ్లీ గ్రామపంచాయతీ సర్పంచ్ పెట్రోల్ పోసి నిప్పటించిన హేయమైన దాడిని ఖండిస్తూ గురువారం రోజున జన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయము ముందు ఉపాది హామీ సమస్త సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందగర్బంగా ఉపాది హామీ మండల ఇంజినీర్ విలాస్ వర్మ మాట్లాడుతూ, ఉపాది హామీ చట్టానికి విరుద్ధంగా యంత్రాలతో పనులు చేపించి అట్టి పనులకు బిల్లులు చెల్లించాలని సాంకేతిక సహాయకుడు పై ఒత్తిడి తేవడ మే కాక అందుకు నిరాకరించిన రాజు సాంకేతిక సహహాయకుడి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం హేయమైన చర్యగా భావించి ఖండించారు. విది నిర్వహణలో ఉన్న ఉద్యోగి పై మండల కార్యాలయం లొనే పెట్రోల్ దాడి కి పాల్పడడం అంటే ఉద్యోగుల కు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

s s consultancy

Also read:లండన్ లో తెలంగాణ బోనాలు

తక్షణమే చట్టపరిధిలో కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి నిరసన కార్యక్రమంలో ఏ పి ఓ రవీందర్, సాంకేతిక సహాయకులు తిరుపతి, రాజేందర్, భీము, మోహన్, భాగ్యలక్ష్మి, లక్ష్మి లు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు గంగారాం, రాజేందర్ మరియు లక్ష్మణ్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.