కొనరావుపేట మండల గ్రామాలలో సేవాహి సప్త దివాస్ కార్యక్రమాలు

0
TMedia (Telugu News) :

కొనరావుపేట మండల గ్రామాలలో సేవాహి సప్త దివాస్ కార్యక్రమాలు

టీ మీడియా, రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట, మే 30:

నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవాహి సప్త దివాస్ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని భాజపా జాతీయ అధ్యక్షులు జెపీ నడ్డా ,అలాగె రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు, అందులో భాగంగా…

s s consultancy

*కొనరవుపేట మండల కేంద్రములో భాజపా మండలశాఖ అధుక్షులు గొట్టే రామచంద్రం ఆధ్వర్యములో కరోనా పేషెంట్లకు కోడిగుడ్లు, పండ్లు, మాస్కులు, సానిటైజర్స్ పంపిణీ చేసారు. కార్యక్రమంలో భాజపా కోనరావుపేట మండల ఉపాధ్యక్షులు మోతుకు మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల పర్షరాములు, మార్గం అశోక్, చల్ల జితేందర్ మోహన్ పాల్గొన్నారు.

*కనగర్తి గ్రామంలో కోవిడ్ పెషేంట్ల అందరికి పౌష్టికాహారం కోడిగుడ్లు, పాలు, మాస్క్ అందించారు. కార్యక్రమంలొ బీజేపీ కిసాన్ మోర్చా కోనరావుపేట మండల అధ్యక్షులు బేంద్రపు శ్రీనివాస్ రెడ్డి, నాయిని రాంరెడ్డి, రావులపెల్లి శ్రీనివాసరెడ్డి, మోకాళ్ళ అంజిరెడ్డి ఉరడి గంగరాజు పాల్గొన్నారు.

*ధర్మారం గ్రామంలో బీజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల్ కార్ బాలజీ గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు, హమాలీలకు, అలాగే కోనరావుపేట మండల పాత్రికేయులకి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, బీజేపి సీనియర్ నాయకులు ఒగ్గు ప్రభాకర్, మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు ఆసరి రాజ్ కుమార్ పాల్గొన్నారు.

  • నాగారం గ్రామంలో కరోనా పేషంట్స్ కి కోడిగుడ్లు, పౌష్టికాహారం, మస్క్లు, సానిటైజర్లు అందించారు. కార్యక్రమములో ఓబిసి మండల అధ్యక్షులు నాగార్జున్ మరియు నాగారం ఉపసర్పంచ్ నాగరాజు, కె రాజు, కె ప్రసాద్, కె రఘు, ప్రదీప్, వెంకటేష్, హరీష్
  • మల్కపేట గ్రామములో కోవిడ్ పేషంట్లకి పౌష్ఠిక ఆహారం చికెన్ కర్రీ, అన్నం, గుడ్లు, మగ్గిక, ఫ్రూట్స్ అందజేయడం జరిగినది. కార్యక్రమములో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు సాగర్ల రాజు, బూత్ కన్వీనర్ ఆకుల నాగరాజు, ఆరే రాజు, తదితరులు పాల్గొనడం జరిగినది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.