ఈటల రాజేందర్ ఇవాళ భాజపాలో..

0
TMedia (Telugu News) :
s s consultancy

మాజీమంత్రి ఈటల రాజేందర్ ఇవాళ భాజపాలో చేరనున్నారు… ఉదయం 5 గంటలకు శామీర్​పేట్​లోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన ఈటల.. 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తన అనుచరులతో కలిసి దిల్లీకి బయలుదేరారు.
11.30కి భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజేందర్​తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబు, కేశవరెడ్డి, గండ్ర నళిని, పలువురు ఓయూ జేఏసీ నాయకులు భాజపాలో చేరనున్నారు. తిరిగి మంగళవారం హైదరాబాద్ చేరుకోనున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.