ప్రధాని నరేంద్రమోడి పాలన 7 వసంతాలు పూర్తైన వేళా…

0
TMedia (Telugu News) :

ప్రధాని నరేంద్రమోడి పాలన 7 వసంతాలు పూర్తైన వేళా….!

సేవా హి సంఘటన్ పేరిట సేవా కార్యక్రమాలు

s s consultancy

–బీజేపీ మండల అధ్యక్షులు సంగెపు గంగారాం

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల జిల్లా,మే 30

ఈ కరోనా విపత్కర పరిస్థితులలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు సేవా హి సంఘటన్ పేరిట సేవా కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ధర్మపురి మండలంలోని ఐదు గ్రామాల లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా జైన గ్రామంలో నిరుపేదలకు
బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సంగేపు గంగారాం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు 2 వ సారి అధికారం లోకి వచ్చిన తరువాత దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆర్టికల్ 370,35ఏ రద్దు పౌరసత్వ సవరణ చట్టం బిల్లు తీసుకురావడం ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ బిల్లులతో పాటు పలు కీలక బిల్లులు పార్లమెంట్ లో
ఆమోదింప జేసిన గొప్ప వ్యక్తి మోడి అని అన్నారు.ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం రోజుకు 18 గంటలు పని చేస్తూ మోడి ప్రపంచ నాయకుడు అయ్యారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి కోరుట్ల మల్లికార్జున్,కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు సోగాల కిషన్, సీనియర్ నాయకులు గాజుల రామదాసు, సట్ట భాస్కర్, సుంకు మధు, కోస్న నరేందర్ రెడ్డి,కట్ట శంకర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.