పొడు భూముల పోరాటం లో బీజేపీ రైతుల పక్షాన ఉంటుంది

0
TMedia (Telugu News) :

పొడు భూముల పోరాటం లో బీజేపీ పార్టీ రైతుల పక్షాన అండగా ఉంటుంది

s s consultancy
             బీజేపీ నాయకులు పాల్వాయి డా" హరీష్ బాబు

టీ మీడియా ప్రతినిధి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మే 27

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ప్రజా కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేత డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్(టీ) నియోజక వర్గంలో దాదాపు 25 వేల మంది ప్రజలు పోడు వ్యవసాయన్ని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన భాధ్యత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పైన ఉన్నదనీ ఈ విషయంలో మొఖం చాటేసి తప్పించుకుందాం అంటే ప్రజలు ఎవరూ చూస్తూ కూర్చోవడానికి సిద్దంగా లేరు అని ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమైతే కొండపల్లి గ్రామంలో కాని, గుంటూరు కాలనీ లో కాని మేము పోడు రైతులను తీసుకొని రావడానికి మేము సిద్దంగా ఉన్నామనీ . ఈ సమస్యకు పరిష్కారం చూపడం లో సిర్పూర్ (టీ) నియోజకవర్గ ఎమ్మేల్యే కోనేరు కోనప్ప విఫలమైనట్టే ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, నిర్బంధాల తోటి ఈ ఉద్యమాన్ని ఆపలేరనే విషయాన్ని గుర్తిస్తే మంచిదనీ . ఇప్పటికే 30 అక్రమ కేసులు బనాయించారు , ఇంకా 300 కేసులు పెట్టినా సరే మేము ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ఆపేదిలేదని పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్, కోనేరు కోనప్ప ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిన భాధ్యత ఉన్నదనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉంటామని” తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా అధ్యక్షులు జెబీ పౌడెల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు గోలెం వెంకటేష్, కాగజ్ నగర్ మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్, ఎంపిటిసి బికాస్ ఘరమి, మాజీ కౌన్సిలర్ లు సిందం శ్రీనివాస్, ముద్దసాని శ్రీరామ్, బాల్క శ్యామ్, చిప్పకూర్తి శ్రీను, కోట వేణు యాదవ్, డోంగ్రి కార్తిక్, సాయికృష్ణ, అల్లాడి రాజు, మిథున్ కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.