*బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు —

0
TMedia (Telugu News) :

ఇది అనేక ఆరోగ్య సమస్యలను దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మీరు దీన్ని అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఈ ఆకులతో టీ కూడా తయారుచేసుకోవచ్చు. బిర్యానీ ఆకుల అన్ని లక్షణాలను ఈ టీ గ్రహిస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది. ఇందుకోసం 2-3 కప్పుల నీరు, 4-5 బిర్యానీ ఆకులు అవసరం. తాజా బిర్యానీ ఆకులు ఉంటే మీరు 3-4 బే ఆకులను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అవి దొరకకపోతే ఎండిన బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. ఒక కుండలో నీరు వేసి మరిగించాలి. దానికి బిర్యీనీ ఆకులను జోడించాలి. నీటిని ఫిల్టర్ చేసి ఒక కప్పులో వేసి వేడి వేడిగా తాగండి.*

1. ఆరోగ్యకరమైన గుండె – ఈ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో రుటిన్, కెఫిక్ ఆమ్లం ఉంటాయి. దీనితో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.

2. నొప్పి నుంచి ఉపశమనం – ఈ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బెణుకులు, కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌తో సహా ఎలాంటి నొప్పినైనా తగ్గించడంలో సహాయపడతాయి.

3. క్యాన్సర్ నిరోధక ప్రభావం- కొన్ని అధ్యయనాల ప్రకారం బిరియానీ ఆకులు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఫైటోన్యూట్రియెంట్స్ కలిగి ఉంటాయి.

s s consultancy

4. మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స చేస్తుంది – తరచుగా మూత్రపిండాల్లో రాళ్ళు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. బిరియానీ ఆకులు శరీరంలో యూరియా స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి బిరియానీ ఆకులను ఉపయోగించవచ్చు.

5. గొంతు నొప్పి – బిరియానీ ఆకులు బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడతాయి. తద్వారా మీకు జలుబు లేదా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

6. మధుమేహం – టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌తో పోరాడవచ్చు ఎందుకంటే ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

Biryani leaves are very good for health. it works as a divine medicine for many health problems . you can take it in many ways.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.