బినామి పేర్లతో భారి స్వాహకు ఏర్పాట్లు..ఖమ్మం కార్పొరేషన్ లోఖతర్నక్ వ్యవహారం 2

0
TMedia (Telugu News) :

బినామి పేర్లతో భారి స్వాహకు ఏర్పాట్లు
-మ్యాన్ పవర్ సప్లైయి ఏజన్సీ అంటూ మోసం

-పాత తేదీల్లో కొత్త కోటేషన్

-అడ్రెస్ లేని పేరుతో ఏజెన్సీ సృష్టి
ఖమ్మం కార్పొరేషన్ లోఖతర్నక్ వ్యవహారం 2

టీమీడియా ఖమ్మం సిటీ బ్యూరో ;
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అవినీతి ఒక్కకోకటి బైట పడుతున్నాయి..కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వివిద రూపాల్లో స్వాహా జరిగినట్లు సమాచారం. పట్టణ ప్రణాళిక విభాగం లోని ఎల్ఆర్ఎస్ విభాగం లో డేటా ఎంట్రీ విషయంలో లక్షల్లో బినామీ బాగోతం బైట పడితే మిగితా విభాగం లు పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది అన్న చర్చ ఉంది.

ఎల్ఆర్ఎస్ దరకస్థులు డేటా ఎంట్రీ పని చేయించుకొని .విధులు నుండి తొలగించి 6 నెలలు అయిన వేతనాలు ఇవ్వక పోవడం వెనుక అవినీతి అసలు కారణం అనేది తెలుస్తోంది..కమిషన ర్ అనురాగ్ జయంతి గతం లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లు జీతాల చెల్లింపు ఫైల్ రిజెక్ట్ చేశారు..కారణం ఆయన అవినీతి ని గుర్తిచడం అనేది తెలుస్తోంది.ముఖ్యంగా దొడ్డ లింగయ్య అనే వ్యక్తి కొటేషన్ తప్పు లు తడక గా ఉండడం,అతని కొటేషన్ ను కమిషనర్ అప్రూవల్ లేకుండా ఆమోదం చెయ్యడం,3 లక్షల కు 8 లక్షలు వరకు బిల్లుబిపెట్టడం అనేది నతెలుస్తోంది .ఇటీవల వేతన బాధితులు కమీషనర్ కి చేసిన పనికి వేతనం కోసం వినతి ఇచ్చారు.స్పందించిన ఆయన తిరిగి ప్రొసీడింగ్ పెట్టాలని ఆదేశించారు.15 రోజుల అనంతరం ప్రొసీడింగ్ పెట్టారు.

   పాత తేదీతో కొత్త  కొటేషన్

డేటా ఎంట్రీ కి మనుషులను సరఫరా చేశారు అని చెప్పబడుతున్న మనిట్ ఏజెన్సీ కి చెందిన దొడ్డ లింగయ్య వద్ద పాత తేదీతో అధికారు లు కొత్త కొటేషన్ తీసుకొన్నారు..సుమారు 9 లక్షలు చెల్లించాలి అని ప్రొసీడింగ్ పెట్టారు..వాస్తవంగా 3 లక్షలు వరకు మాత్రమే వేతనాలు ఇవ్వాలి..మిగిలిన 6 లక్షలు స్వాహకు ఏర్పాటు అనేది తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం డేటా ఎంట్రీ చేస్తున్న వారికి 3 నెలలు నుండి వేతనాలు లేవు వారి ఉద్యోగం పర్మినెంట్ చేయిస్తా అంటూ..బారి వసూళ్ల జరిగినట్లు తెలుస్తోంది.ఇందుకు సమందించి టీమీడియా విచారణ కొనసాగుతోంది.

s s consultancy
అడ్రెస్ లేని ఏజెన్సీ కొటేషన్

ఎల్ ఆర్ఎస్ విభాగం లో డేటా ఎంట్రీకి మ్యాన్ పవర్ సప్లైయి కి కొటేషన్లు పిలువగా ముగ్గురి నుండి వచ్చాయి అని అధికారు లు ప్రొసీడింగ్ లోపేర్కొన్నారు..అందులో రెండు కొటేషన్లు లో అడ్రెస్ పూర్తి లేదు.ఇంటి నెంబర్ అసలు లేదు.ఆమోదం పొందినట్లు చెపుతున్న లింగయ్య కొటేషన్ పై మాత్రమే ఇంటి నెంబర్ ఉంది..అన్నింటి లెటర్ ప్యాడ్ లపై ఉన్న ఫాంట్(అక్షరాలు)ఓకే విధంగా ఉండటం.. ఓకే వ్యక్తి మూడు వివిధ పేర్లతో దాఖలు చేశారు అనేది తెలుస్తోంది..బినామి వ్యవహారం తెలియ చేస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.