చికెన్ కొట్టు ప్రభాకర్ @దొంగల ముఠా

8 మంది నిందితుల అరెస్ట్,.40 ద్విచక్రవాహనాలు స్వాదీనం : ఎస్పీద్విచక్ర వాహనములు తస్కరిస్తున్న ఖమ్మం జిల్లా కూసుమంచి మడలం కు చెందిన 8 మంది ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40 ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు.

0
TMedia (Telugu News) :

8 మంది నిందితుల అరెస్ట్,.40 ద్విచక్రవాహనాలు స్వాదీనం : ఎస్పీ

టీమీడియా..

ద్విచక్ర వాహనములు తస్కరిస్తున్న ఖమ్మం జిల్లా కూసుమంచి మడలం కు చెందిన 8 మంది ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40 ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ ( SP R. Bhaskaran ) తెలిపారు. సూర్యాపేట టౌన్ పోలీసు స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాలు.

.గత కొన్ని నెలలుగా సూర్యాపేట పట్టణం లో ద్విచక్ర వాహనాలు తస్కరణకు గురి అవుచున్న నేపద్యం లో, సూర్యాపేట పట్టణ పోలీసు లు మూడు బృందములు ( కెమేరాల, సాంకేతిక మరియు క్షేత్ర స్థాయి విచారణకు) ఏర్పాటు చేసి, సుమారు 4 నెలలు శ్రమించి సేకరించిన పక్క సమాచారాన్ని అనుసరించి నిందితులను పట్టుకొనుటకు ఈ నెల 3 వ తేదీ శనివారం నాడు ఉదయం ఖమ్మం క్రాస్ రోడ్స్,

సూర్యాపేట వద్ద ప్రత్యేక బృందం తో వాహనాలు తనిఖీ ప్రారంభించి నిందితుల గురించి వేటాడుచుండగా ఉదయం 9 గంటల ప్రాంతం లో ప్రధాన నిందితుడు అయిన చల్లా ప్రభాకర్ అతని ఒక అనుచరుడితో ఒక ద్వి చక్ర వాహనం పై వస్తుండగా గమనించి, ఆపి అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా ప్రదాన నిందితుని పేరు చల్లా ప్రభాకర్ అని అతని అనుచరుడిని పేరు స్వామి గా తెలియరాగ వారిని లోతుగా ప్రశ్నించినాము.

అట్టి విచారణలో చల్లా ప్రభాకర్ తల్లంపాడు గ్రామం ఖమ్మం జిల్లాకు చెందినవాడుగా మరియు తాను ఆర్ధికంగా చితికి పోయినందున ఖమ్మం జిల్లా కూసుమంచి లో గత 6 నెలల క్రితం ఒక పాస్ట్ పుడ్ సెంటర్ ప్రారంభించి ఇట్టి కేసులో నిందితులు గా గుర్తించబడిన (పైన పేర్కొనిన వారు) మెకానిక్, డ్రైవర్లు మొదలైన వారి యొక్క ప్రోద్భలం తో ఖమ్మం లో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ద్వి చక్ర వాహనమునకు చెందిన ప్రత్యేక తాళం ఖరీదు చేసి దాని ద్వారా గత మార్చి నెలలో మొదటగా ఖమ్మం లో ఒక ద్వి చక్ర వాహనం దొంగిలించి దానిని ఇట్టి కేసు లో రిసీవర్ అయిన స్వామి కి అమ్మిన్నాడు.

s s consultancy

ఆ విధంగా తన నేరములు ప్రారంభించి అప్పటినుండి సూర్యపేట లో 13, కోదాడ లో 4, జగ్గయ్యపేట లో 6, నందిగామ లో 4, ఖమ్మం లో 5, హన్మకొండ, కూకట్ పల్లి లో ఒకటి మరియు వివరాలు ఇంకా తెలియనివి-5 వాహనాలు దొంగలించి వాటిని పైన పేర్కొనిన రిసీవర్లకు ఏడు వేల రూపాయల మొదలు బండి యొక్క మోడల్, క్రొత్తదనాన్ని అనుసరించి 20 వేల వరకు అమ్మినాడు.

నేరములు చేయుటకు ప్రధాన నిందితుడు అయిన ప్రభాకర్ ఒక్కొక్కసారి తన సహచరులను వెంట తెచ్చుకొనగా, ఎక్కువసార్లు పోలీసు వారికి చిక్కరాదనే ఉద్దేశ్యం తో తన హెల్మెట్ వెంట తెచ్చుకొని బస్ లలో ప్రయాణించి, పైన పేర్కొనిన పట్టణాలలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలలో పగటిపూట మాత్రమే పోలీసులకు అనుమానం రాకుండా ప్రదేశాలను ఎంచుకొని కొద్ది క్షణములలోనే వాహనాన్ని చాకచక్యం గా తస్కరించి మాయమయ్యేవాడు.

ఇట్టి దర్యాప్తు సూర్యాపేట డిఎస్పీ మోహన్ కుమార్ పర్యవేక్షణలో, పట్టణ ఇన్స్పెక్టర్ ఎ. ఆంజనేయులు ఆద్వర్యంలో, ఎస్‌ఐలు పి. శ్రీనివాస్, ఎ. శ్రీనివాస్ లు, వారి సిబ్బంది అయిన హోం గార్డ్ మధు, కానిస్టేబుళ్లు కరుణాకర్, కృష్ణ, సైదులు, శ్రవణ్ కుమార్, ఏ‌ఎస్‌ఐ అంజయ్య మరొక హోం గార్డ్ రాజు లు చాకచక్యంగా వల పన్ని నిందితులను పట్టుకొని వారివద్ద నుండి భారీగా చోరీ సొత్తు ని స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి పని తీరుని అభినంధిస్తూ తగిన రివార్డులను ప్రకటించి వారి సర్విస్ బుక్ లలో నమోదు చేయుట జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

bike thieves nabbed, 40 vehicles seized - Tmedia Telugu news Network
bike thieves nabbed, 40 vehicles seized

8 మంది నిందితుల అరెస్ట్,.40 ద్విచక్రవాహనాలు స్వాదీనం: నిందుతుల పేర్లు వివరములు:

  1. చల్లా ప్రభాకర్, నివాసం: తల్లంపాడు గ్రామం, ఖమ్మం మండలం మరియు జిల్లా.
  2. బండారు స్వామి, నివాసం: పెరిక సింగారం గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ( Receiver)
  3. బొమ్మగాని ఉపేందర్, నివాసం: కుసుమంచి గ్రామం మరియు మండలం, ఖమ్మం జిల్లా. ( Receiver)ద్విచక్ర వాహనములు తస్కరిస్తున్న ఖమ్మం జిల్లా కూసుమంచి మడలం కు చెందిన 8 మంది ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40 ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు.
  4.  ఊడుగు సీతారాములు, నివాసం: ముత్యాలగూడెం గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ( Receiver) మల్లెబోయిన సతీష్, నివాసం: ముత్యాలగూడెం గ్రామం కుసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ( Receiver)
  5. గుగ్గిళ్ళ వెంకటేష్, నివాసం: చేగొమ్మ గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా( Receiver)
  6. జరుపుల చిరంజీవి నివాసం: లోక్య తండా గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ( Receiver)
  7. కస్తాల నవీన్ , నివాసం: మల్లేపల్లి గ్రామం, కూసుమంచి మండలం,
Web title : bike thieves nabbed, 40 vehicles seized
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.