బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మాటూరి రవీందర్

టి మీడియా ప్రతినిధి మొగుళ్ళపల్లి

0
TMedia (Telugu News) :

టి మీడియా ప్రతినిధి మొగుళ్ళపల్లి
బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన మాటూరి రవీందర్ ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర రథసారథి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆదేశాల మేరకు నియామకపు ఉత్తర్వులను జారీ చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రకటించారు.

s s consultancy

Also readభూ దందా రాయుళ్ల పై మొదలైన చర్యలు

మాటూరి రవీందర్ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటాలు చేసి, లాఠీ దెబ్బలను తిని, జైలుకు సైతం వెళ్లడం జరిగిందని, బీసీ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ, బీసీలను ఐక్యం చేయడంలో ముందు ఉండేవాడని, ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్లు మహేందర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన మాటూరి రవీందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీ సంక్షేమ సంఘంను జిల్లాలో బలోపేతం చేస్తానని, తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులకు రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.