భారీ స్థాయిలో పేలుడు పదార్థాం పట్టివేత – తప్పిన భారీ ప్రమాదం

పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో

0
TMedia (Telugu News) :

 

వరంగల్:

పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ మరియు భీమదేవరపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో అక్రమంగా నిల్వవుంచిన 36 బస్తాల్లో వున్న 18 క్వింటాళ్ళ గన్‌ఫౌడర్ పేలుడు పదార్థంతో పాటు ఒక ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక వ్యక్తిని అరెస్టు చేయగా మరోవ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో వల్లే ఐలయ్య, తండ్రి పేరు ఐలయ్య, వయస్సు 36, విశ్వనాథనగర్, భీమదేవర పల్లి మండలం, వరంగల్ అర్బన్ జిల్లా చెందినవాడు కాగా కరీంనగర్ ప్రాంతానికి చెందిన పురుషోత్తం ప్రస్తుతం పరారీలో వున్నాడు.

s s consultancy

Read Also:కమ్యూనిస్టుభూషయ్య

ఈ సంఘటన సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన వల్లే ఐలయ్య వ్యవసాయం నిర్వహించేవాడు. దీని ద్వారా వచ్చిన ఆదాయం నిందితుడికి సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించుకోవాలని అనుకున్నాడు. జిల్లాలోని క్రషర్ మరియు గ్రెనెట్ కర్మగారాలకు పెద్ద మొత్తంలో గన్ పౌడర్ పేలుడు పదార్థం ఎక్కువ మొత్తం అవసరం వుండదాన్ని గుర్తించిన క్రషర్ మరియు గ్రెనెట్ కర్మగారాలకు ఆక్రంగా గన్ పౌడర్ సరఫరా చేయడం ద్వారా ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు పురుషోత్తం నుండి భారీ మొత్తంలో గన్ పౌడరను ఏలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా కోనుగోలు చేసాడు.

Also Read: 22 ఏళ్ల సేవలకు 22 తో ముగింపు

కోనుగోలు చేసిన గన్‌పౌడర్‌ను నిందితుడు ఆటో ట్రాలీ ద్వారా నిందితుడు తన ఇంటి పెరటిలో భద్రపర్చేవాడు.భద్రపర్చిన గన్ పౌడర్ను నిందితుడు ఐలయ్య అవసరం క్రషర్ మరియు గ్రెనెట్ కర్మగారాలకు ఆక్రమంగా సరఫరా చేసేవాడు. ఈ ఆక్రమ నిల్వపై పోలీసులకు అందిన సమాచారంతో టాస్క్ఫర్స్ పోలీసులు మరియు భీందేవరపల్లి పోలీసులు సంయుక్తం దాడి చేసి నిందితుడి ఇంటిలో భద్రపర్చిన పేలుడు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సండ్ర

ముఖ్యంగా నిందితుడు గన్ పౌడర్ ను ప్రజలు నివసించే ఇండ్ల మధ్యలో భద్రపర్చడం ద్వారా ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన భారీస్థాయిలో పేలుడు జరిగివుండేది. ముందుగానే భారీ మొత్తంలో పేలుడు పదార్థాన్ని గుర్తించి ప్రమాదం జరుగకుండా పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫర్స్ ఎ.సి.పి ప్రతాప కుమార్, ఇన్ స్పెక్టర్ శ్రీనివాజీ, భీందేవరపల్లి ఎస్.ఐ చంద్రమోహన్, ఏ.ఏ.ఓ సల్మాన్‌పాషా, ట్క్ఫా ర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుల్లు శ్రీకాంత్, శ్రీను, మహేందర్, సృజన్, లియాకత్ ఆలీ, చిరంజీవిలను పోలీస్ కమిషనర్ అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.