బహుజన బతుకమ్మ పుస్తక ఆవిష్కరణ……టి అర్ కె ట్రస్ట్

0
TMedia (Telugu News) :

టి మీడియా, రాజన్న సిరిసిల్లా జిల్లా, వేములవాడ, అక్టోబర్ 13:

వేములవాడ పట్టణంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల వేదికగా అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క రచించి ఆవిష్కరించిన బహుజన బతుకమ్మ నల్లమల పరిరక్షణ పుస్తక ముద్రణ కోసం వేములవాడ కు చెందిన ఎన్ అర్ ఐ, టి ఆర్ కే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ ముందుకు వచ్చి సహకరించారు. అరుణోదయ విమలక్క పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం సహజ వనరుల పరిరక్షణ అనే నినాదంతో ఈ సంవత్సరం బహుజనుల బతుకమ్మ నిర్వహించామని, దీంతోపాటు నల్లమల పరిరక్షణ _ బహుజన బతుకమ్మ పేరుతో రచించిన పుస్తకాన్ని ముద్రించడం కోసం ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న సమయంలో సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఆర్థిక, హార్దిక సహాయం చేసిన టీ ఆర్ కె ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ మరియు డైరెక్టర్ మొట్ట ల మహేష్ కుమార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

s s consultancy

వేములవాడ బతుకమ్మ వేడుకల వేదికగా పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాకుండా టి ఆర్ కే ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ పుస్తక ముద్రణ సమయంలో చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ హృదయపూర్వకంగా అభినందించారు. బహుళజాతి కంపెనీలు వేల కోట్లు సంపాదించడానికి ప్రకృతి సిద్ధంగా ఉన్న సహజ వనరులను కొల్లగొడుతున్నాయి అని, అంతేకాకుండా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం బాక్సైట్ వంటి ఖనిజాల కోసం కోట్లాది మొక్కలను అనేక వన్య జాతులను అంతం చేస్తూ ,

Bahujana Batukamma

అక్కడ జీవించే గిరిజన జాతులకు నిలువనీడ లేకుండా చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలపడానికి నల్లమల పరిరక్షణ బహుజన బతుకమ్మ పుస్తకాన్ని విడుదల చేశామని తెలిపారు.పేద ప్రజల సహాయార్థం ట్రస్ట్ ప్రారంభించడమే కాకుండా ఇలాంటి సామాజిక బాధ్యత గల కార్యక్రమాలు నిర్వహించడం తోట రామ్ కుమార్ గొప్పతనం అని అరుణోదయ విమలక్క పేర్కొన్నారు.

Bahujana Batukamma book launch.. TRK Trust.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.