8వ తరగతి వరకు బదిలీ సర్టిఫికెట్ అవసరం లేదు… దేవసేన

0
TMedia (Telugu News) :
s s consultancy

8వ తరగతి వరకు బదిలీ సర్టిఫికెట్ అవసరం లేదు… దేవసేన
టీ మీడియా హైదరాబాద్ బ్యూరో జూన్ 23. ఒక పాఠశాల నుండి మరో పాఠశాల లో చేరడం కొరకు 8వ తరగతి వరకు బదిలీ సర్టిఫికెట్ అవసరం లేదని పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన అన్నారు. పాఠశాల మారాలనుకున్న విద్యార్థులను ప్రయివేటు విద్యాసంస్థలు బదిలీ సర్టిఫికెట్ కొరకు ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, విద్యా హక్కు చట్టం లో బదిలీ సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టంగా ఉందని, బదిలీ సర్టిఫికెట్ కొరకు ఎవరైనా ఇబ్బంది పెడితే తమ జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని, విద్యార్ధి చేరాలనుకున్న పాఠశాలలో చైల్డ్ ఇన్ఫో లో సదరు విద్యార్ధి పేరు నమోదు చేసేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.