నిరుద్యోగులను నిరాశపరిచిన సీఎం .. సి ఐ టి యు జిల్లా కార్యదర్శి

0
TMedia (Telugu News) :
s s consultancy

నిరుద్యోగులను  నిరాశపరిచిన  సీఎం  జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్.  సి ఐ టి యు జిల్లా కార్యదర్శి  సిహెచ్ చంద్రశేఖర్ విమర్శ.

 ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం విడుదల చేసిన జాబ్ క్యాలెండరు  నిరుద్యోగులను తీవ్రంగా   నిరాశ పరిచిందని, సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి హెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. ఈ యేడాది పదివేల  ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. లక్షలాది మంది చదువుకొని ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని,  దీనితో ముఖ్యమంత్రి  జగన్ పైన పెట్టుకున్న ఆశలు నిరాశ్రయులైన అన్నారు. ఎన్ని ఉద్యోగాలు  ఖాళీగా ఉన్నాయి  ఎన్ని  పోస్ట్లు భర్తీ చేసాము చేసాము, జిల్లాల వారీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 25000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,  పోలీస్ శాఖలో   20000   వేలు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సచివాలయం 8000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని  లైబ్రరీ సైన్స్  పోస్టులు  6000 వేలు ఖాళీగా ఉన్నాయని, గ్రూప్ 1 గ్రూప్ 2 లో 2000 పోస్టులు ఖాళీగా ఉంటే 36 పోస్టులు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ఖాళీలను క్యాలెండర్లో పేర్కొనక పోవడం పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఆరు లక్షలు పోస్టులు భర్తీ చేసినట్లు పచ్చి అబద్ధాలు ప్రకటించారన్నారు.  సచివాలయం పోస్టులు, గౌరవ వేతనం తో వాలంటరీ పోస్ట్ లు మాత్రమే భర్తీ చేశారని,  కరోనా సమయంలో వైద్యరంగంలో తాత్కాలిక  నియామకాలు మాత్రమే భర్తీ చేశారు. ఆర్టీసీలో 50 వేల మంది ఉద్యోగులు గతంలో ఉన్న వారే తప్ప, ప్రభుత్వంలో విలీనం చేశారు కొత్తగా నియామకాలు చేపట్టే లేదని ఆరోపించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను గతంలో ఉన్న వారే నే  ఆప్కాస్ లో నమోదు చేయించారు. కొత్తగా ఎవరినీ తీసుకోలేదు. తీసుకున్నట్లు చూపించారు ఇది పచ్చి మోసం  అబద్దాలు చెప్పడం మే. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేశారు ఏ జిల్లాలో  ఏ శాఖలో ఎన్ని భర్తీ చేశారు, బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇసుకలో   ఏపీఎండీసీ లో రెండువేల మంది అవుట్ సోర్స్ ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలగించిన విషయం ఎందుకు చెప్పలేదని ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. ప్రైవేట్ పరిశ్రమలు  కు రాయితీలు ఉద్యోగుల రావాలంటే  ప్రత్యేక హోదా దానికోసం ఎందుకు మాట్లాడటం లేదని కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.  ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కన్వీనర్ కర్ర తోటి హరి నారాయణ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.