అందుకే ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేత : ఆనందయ్య

0
TMedia (Telugu News) :

అందుకే ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేత : ఆనందయ్య🌷

🔹తయారు చేసిన మందు అయిపోయింది

🔹మూలికలు, పదార్ధాల సేకరణకు 2-3 రోజులు పడుతుంది

🔹కరోనా ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమ నిర్వహకుడు ఆనందయ్య.

s s consultancy

నెల్లూరు : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్ది భరోసాతోనే శుక్రవారం కరోనా ఆయుర్వేద మందును పంపిణీ చేశామని ఆనందయ్య తెలిపారు. తయారు చేసిన మందు అయిపోవడంతో పంపిణీ నిలిపివేశామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, పదార్ధాలు సేకరించడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోపు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందుకే మందు పంపిణీ ప్రారభించాం: ఎమ్మెల్యే కాకాని

‘‘ఆనందయ్య వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ నివారణకు కూడా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. ఈ మందు అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. భౌతిక దూరం పాటించని అంశాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది. కరోనాతో ఆక్సిజెన్ లెవల్స్ తగ్గిన వారికి కంట్లో డ్రాప్స్ వేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. అందుకే మందు పంపిణీ ప్రారభించడం జరిగింది. 
రద్దీ కారణంగా పంపిణీ సవ్యంగా సాగలేదు. సీఎం జగన్ కూడా దీనిపై సమీక్ష చేశారు. ఆయుష్ అధికారుల రిపోర్ట్ కూడా ఇవాళ వస్తుంది. ఐసీఎంఆర్‌ బృందం కూడా నెల్లూరు రానుంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రజలందరికీ పంపిణీ చేస్తాం. ఇతర రాష్ర్టాల నుంచి ఎవరూ రావద్దు. ఆన్‌లైన్‌లో సర్వీస్ కూడా చేపట్టాలని అనుకుంటున్నా౦

6281025921 phone nbr
కృష్ణ పట్నం
ఆనందయ్య గారి నెంబర్…
ఆయుర్వేద మందు..
Covid 19 వచ్చిన వాళ్లు కాంటాక్ట్ చెయ్యండి

శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు సీఎం ఆదేశం……….

అమరావతి:- నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కొవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు. 
నేటి నుంచి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. దీంతో సుమారు 3కి.మీ మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు. 
నెల్లూరు జిల్లా ఆయుర్వేద మందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలోనే ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.