ఏ ఏస్ ఐ విజయమణి..విజయ ప్రస్థానం

0
TMedia (Telugu News) :

ఏ ఏస్ ఐ విజయమణి..విజయ ప్రస్థానం

 
ఆమె ఒక పేదింటి ఆడపడుచు ఆమె ఎలాగైనా ఉద్యోగం సాధించి సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలని. మధ్యరకం కుటుంబము నుండి వచ్చిన అపజయాలను సైతం లెక్క చేయకుండ .. తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ … ఆమెలో మానసిక మనోధైర్యాన్ని నింపుకుని సాహసమే ఊపిరిగా మలుచుకుని.. ఒక ఆడపిల్లని మర్చిపోయి పురుషులతో సమానంగా దీటుగా .. వ్యక్తిత్వ వికాసం ఇప్పించుకుని తమ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో….కష్టపడి ఉద్యోగం సాధించి  సమాజంలో మంచి గుర్తింపు తీసుకురావడం లక్ష్యంతో ఆమెలో ధైర్యాన్ని నింపుకుని పట్టుదలతో ఉద్యోగం సాధించిన  ఏ ఎస్ ఐ తాటికొండ విజయమణి.

కుటుంబ ప్రోత్సాహంతోనే… ఉద్యోగం సాధించిన తాటికొండ విజయమణి.

●కుటుంబ ప్రస్తావన
తండ్రి తాటికొండ మాసిలామణి,తల్లి తాటికొండ సరస్వతి. భర్త ఖండవల్లి ఆశీర్వాదం .గ్రామం జగిత్యాల చిన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పోలీసు ఉద్యోగం చేయాలనే  కుతూహలంతో ఇంటర్ పూర్తి చేశాక అప్పటి ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల  పడటం వలన అప్లై  చేశారు.వారి తండ్రి  జగిత్యాల టౌన్ డి.ఎస్.పి ఆఫీస్ లో రైటర్ గా విధులు నిర్వహించే వారు.వారి భర్త డి.ఎస్.పి ఆఫీస్ లో హోంగార్డుగా విధులు నిర్వహించే వారు. అప్పటికే వారికి ముగ్గురు పిల్లలువారి భర్త నైట్ అంతా హోంగార్డుగా విధులు నిర్వహించే వారు.ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే  వారికి నెల మొత్తం వచ్చే వరకు వెయ్యి రూపాయల తోనే కుటుంబాన్ని నడిపించే వారు.వారి తల్లిదండ్రులకు మొత్తం నలుగురు ఆడపిల్లలు ఒక అన్నయ్య ఉన్నారు.వాళ్ల తండ్రి గారు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేకుండా  చూసుకున్నారని చెప్పారు.వారు శిక్షణ చేస్తున్నప్పుడు వారి తండ్రి గారిని అనేకమంది ఆడపిల్లలకు ఇంతస్వేచ్ఛ అవసరమా ఆడపిల్లలకు పోలీస్ జాబు అవసరమా అని.ఆడపిల్లలు అంటే సమాజానికి చులకన భావం చాలా ఉండేది  ఆడపిల్లలు పెళ్లి చేసుకొని అత్తగారు ఇంట్లో ఉండాలని  అనే ఒక  మూఢనమ్మకం ప్రభావం ఈ సమాజం అనేక మందికి ఉన్నది.వారి తండ్రిగారి యొక్క మాటల ను పట్టించుకోకుండా తనకంటూ ఒక  ఉన్నత స్థాయిని కల్పించాలని ప్రతిరోజు ఓపికగా ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు .తనకు ఈ జాబ్ రావడం కుటుంబం సభ్యులు చాలామందికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.

వారి కుమార్తె కూడా తాతయ్యని తల్లిదండ్రులని ఆదర్శంగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరారు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

s s consultancy

●తన విద్యాభ్యాసం..
చిన్నప్పటి నుండి  జగిత్యాల గ్రామంలోప్రభుత్వ  పాఠశాల, కళాశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

●పోస్టింగ్ మరియు ప్రమోషన్లు
మొదటి పోస్టింగ్ 1992 లో కరీంనగర్ లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో  విధులు నిర్వహించారు.అలాగే జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు.దాని తర్వాత  కోరుట్ల పోలీస్ స్టేషన్లో విధులు  నిర్వహించారు.తర్వాత కరీంనగర్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు.దాని తర్వాత 2011 హెడ్ కానిస్టేబుల్ గ ప్రమోషన్ పై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత కరీంనగర్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు.దాని తర్వాత 2016 ఏ ఎస్ ఐ ప్రమోషన్ పై మంతిని ముత్తారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు.దాని తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి కరీంనగర్  సిపి కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు షీ టీం లో విధులు నిర్వహిస్తున్నారు.

.ఈ సందర్భంగా టి మీడియా దినపత్రికతో వారు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలకు నేను చెప్పేది ఒక్కటే మేము స్త్రీలను ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షతను న్యూనతాభావం గా భావించకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముందుగా మహిళలకు కావలసినది ప్రోత్సాహం. కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుండి అన్నివేళలా ఉన్నట్లయితే స్త్రీలు ఎంతటి స్థాయికైనా ఎదిగే గానత  సాధించే శక్తి స్త్రీలకు ఉంటుంది. ముందుగా మహిళలకు తెలుసుకోవాల్సింది చాలా ఉందని. చట్టాలపై మహిళా హక్కులపై అవగాహన కలిగి ఉండాలని. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ  ఆడ పిల్లలకు ముందుగా ఇంట్లోనే హెచ్చరించి పంపిస్తుంటారు. ఎవరితో మాట్లాడకు ఇంటికి సమయానికి చేరుకొని అనేక జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంటారు. ఇదే హెచ్చరిక అబ్బాయికి తల్లిదండ్రులు అనేవారు చెప్పరు కనీసం మోటార్ సైకిల్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని కూడా చెప్పారు కొంతమంది ఉన్నారు. ఆడపిల్లను కన్న తర్వాత కొద్దో గొప్పో చదివించి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యత అనేది తీర్చే సుకుంటారు. కానీ ఆ అమ్మాయికి ఉన్నటువంటి లక్ష్యాన్ని గాని ఆలోచనలు గాని పట్టించుకోదు. ముందుగా తల్లిదండ్రులు ఆడపిల్ల లో ఉన్నటువంటి న్యూనతా భావాన్ని భయాన్ని పోగొట్టి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే మహిళలుగా ప్రోత్సహించాలి. వృద్ధాశ్రమా లు తల్లిదండ్రులు పట్టించుకోని కొడుకుల ద్వారానే ఏర్పడ్డాయి కానీ కూతుళ్ల ద్వారా ఏర్పడలేదు. పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు చూసుకోవడం లేదని తల్లిదండ్రులు వచ్చి వాపోతుంటారు అప్పుడు వాళ్లను చూసి బాధ ఆనిపిస్తుంది. సమాజంలో కూడా స్త్రీ పురుషుడు అనే వివక్షతతో చూడకుండా  అనేక రకాల ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నత స్థాయిలో  ఉంచాలని కోరుతున్నాను.

( వినయ్, రామగుండం, పెద్దపెల్లి జిల్లా, సెల్ నెంబర్ :  8790330963 )

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.