కరోన పై యుద్ధం చేస్తున్న ఆశా వర్కర్లు.

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోన పై యుద్ధం చేస్తున్న ఆశా వర్కర్లు.
(టీ -మీడియా) జూన్ 06
ములుగు జిల్లా ప్రతినిధి

ములుగు జిల్లా వెంకటాపుర్(రామప్ప) మండలం నల్లగుంట గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ మండల సుచరిత శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన
కరోన రోగులకు భరోసా నిస్తూ వారికి 4 కేజీల బియ్యం,కూరగాయలు,4గుడ్లు చొప్పున నిత్యావసర వస్తువులు అందజేస్తూ,ఆశా కార్యకర్తలను తెరాస శ్రేణుల సమక్షంలో ములుగు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ సన్మానించారు.
నర్సాపూర్ గ్రామంలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు అటికె సాయన్న మరణం తీరని లోటు అని వారి దశ దిన ఖర్మకు హాజరయ్యారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా పోరిక గోవింద్ నాయక్  మాట్లాడుతూ
కోవిడ్ 19 గురించి ప్రజలను చైతన్యం చేస్తూ
కోవిడ్ బాధితులకు,వారి ప్రాణాలను పణంగా పెట్టి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్న
ఆశా కార్యకర్తలను మనం ఎంతో రుణ పడి ఉండాలి అన్నారు.కరోన మొదటి దశ ప్రారంభం నుండి నేటి వరకు అన్ని గ్రామాల్లో ఆశా కార్యకర్తలు అమోఘమైన సేవలు అందిస్తున్నారు.
ప్రజలకు వ్యాధుల మీద పరిశుభ్రత మీద అవగాహన కలిపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగుంట గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి రమేష్,ఉప సర్పంచ్ భూక్య శంకర్ నాయక్,రైతు బంధు కో ఆడినేటర్ మందల రణ్ ధీర్ రెడ్డి,మందల మధుకర్ రెడ్డి,లక్కీ తిరుపతి,గ్రామ పంచాయతీ సిబ్బంది రాములు,సత్యపాల్ రెడ్డి,గువ్వ రవి,కుమార్ స్వామి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.