బాలామృతం కు అరిష్టాలు .. ఐసీడీస్ అధికారుల ఉదాసీనత

టీ మీడియా, నవంబర్ 5, ప్రత్యేక ప్రతినిధి:

0
TMedia (Telugu News) :

 

balmrutham
balmrutham

బాలామృతం కు అరిష్టాలు

ఐసీడీస్ అధికారుల ఉదాసీనత

టీ మీడియా, నవంబర్ 5, ప్రత్యేక ప్రతినిధి:

చిన్నారులకు పౌష్టికాహారం అంధించాలని బాలమృతంఅనే పేరుతో స్వచ్ఛమైన , పిండి పదార్ధాలను అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తుంది  ఆపౌష్టిక ఆహారం ఆఖరికి వీధికుక్కల పాల కావడంతో చూసిన ప్రజలు అవాక్కవుతున్నారు. కుక్క బాలమృతం ప్యాకెట్టును రోడ్డు మీదకు తీసుకు వచ్చి చింపి పిండిని తింటున్న చిత్రం చూపరులను ఒకింతగా ఆశ్చర్య కి గురిచేసింది. అంగన్వాడీ పరిధిలో కోట్ల వ్యయంతో సరఫరా చేస్తోంది.అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణీలు బాలింతలు పిల్లలకు బలవర్ధకమైన పౌష్టికాహారంతో అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రోడ్డుపై బాలామృతం ప్యాకెట్ నోటితో పట్టుకుని రోడ్డుపై తీసుకొనివచ్చి తింటున్న వైనం ఒక చోట, విడిచిన వస్త్రాల వద్ద పడవేసిన దృశ్యం లు మరోచోట టీ మీడియా పరిశీలనలో వెల్లడి అయ్యాయి.

అంగన్వాడీ , అధికారులు సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి ఈ సంఘటనతో బట్టబయలు ఐయింది. కేంద్రాలకు పంపిణీ చేసే ప్యాకెట్లు అసలు లెక్కలు తేల్చాల్సి ఉన్నది. కేంద్రాలకు వెళ్లి కేంద్రల్లో జరిగే ప్రక్రియను సంబంధిత అధికారులు చెయ్యడం లేదనేది తెలుస్తున్నది. పర్యవేక్షణ కరువైనట్లు స్పష్టం అవుతోంది. పిల్లలుకు,బాలింతలు,గర్భిణీలు కేంద్రాలకు వస్తున్నారా లేదా…? అనేది సందేహం వ్యక్తమవుతున్నది. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి పధకం అమలు చేస్తుంటే, ఆ పధకమ్ సక్రమంగా నడుస్తున్నట్లు లేదు. నిర్లక్ష్యం కావడానికి ఆ పరిధిలోని సిడిపిఓ కేంద్రాల పర్యవేక్షణ లేనట్టు వున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

s s consultancy

చర్యలు తీసుకోవాలి.

రోడ్డుపై ఒక వీధి కుక్క జగనన్న బాలమృతం ప్యాకెట్టును రోడ్డుకు తీసుకు వచ్చి ఇలా చెయ్యడానికి కారణమైన సిబ్బందినా, తీసుకున్న వ్యక్తులా ఇలా చేసింది అనే విషయంపై అధికారులు ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్రాలు నిర్వహణ విషయం లోను సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం నగరం లో ఒక కేంద్రం కు తాళాలు వేసి వారం అవుతోంది..ఒక ప్రజాప్రతినిధి బంధువు నిర్వహిస్తున్న ఈ కేంద్రం బోర్డు కనపడ కుండ పెట్టారు.ఇటువంటి వి అనేకం ఉన్నయి.

విధుల్లో బినామిలు

కొన్ని అంగన్వాడీ కేంద్రాలు ను బినామిలు నిర్వహిస్తున్న రు.అసలు ఉద్యోగులు కార్పొరేటర్లు, నేతల కు చెందిన రాజకీయ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.

కార్యాలయం నిర్వహణ లో లోపం

ఖమ్మం జిల్లా కేంద్రం లోని ఐసిడిఎస్ కార్యలయ నిర్వహణ లోనే లోపాలు కనిపించాయి.అఫిస్ పరిసరాలను పరిశీలించిన ప్రతి ఒక్కరికీ విషయం అర్థం అవుతుంది.

తప్పుడు నివేదికలు

అంగన్వాడీ కేంద్రాలు నిర్వహణ,పరిశీలన,అధికారులు,సిబ్బంది రవాణా ఛార్జిలకు సమంధించి న నివేదికల్లో పలు అవక తవకలు టీ మీడియా పరిసినలన లో వెల్లడి అయ్యాయి ఒక అధికారి విజిటింగ్ వెళ్లిన ఖర్చులు పేరుతో పెట్టిన బిల్లు లోని వాహనం నెంబర్ అసలు ఆర్టీఏ వాలెట్ లోనే లేక పోవడం వీరి అక్రమలకు నిదర్శనం గా ఉంది..బిల్లుల పై పరిసినలన సాగుతోంది.(మరో కథనం లో మరికొన్ని వివరాలు)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
vasi web
abhaya hospitals