కేటీఆర్ కు పిర్యాదు చేసిన ఉమేష్ ని అరెస్ట్ చెయ్య లట:గ్రామీణ వైద్యులు,న్యాయవాది కోరిక

0
TMedia (Telugu News) :

కేటీఆర్ కు పిర్యాదు చేసిన ఉమేష్ ని అరెస్ట్ చెయ్య లట:గ్రామీణ వైద్యులు,న్యాయవాది కోరిక

టీమీడియా ప్రత్యేక ప్రతినిధి..ఖమ్మం)

మధిర లోని ఆస్పత్రి లో కోవిడ్ కు చికిత్య పొందుతున్న ఉమేష్ అనే యువకుడు కెవిఆర్ హాస్పటల్ .డాక్టర్ ఇంజక్షన్ చీటి తో సహా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో పిర్యాదు చేసారు.ఆస్పత్రి నిర్వహకం పై మంత్రి ఖమ్మం జిల్లా కలెక్టర్ ని విచారణ జరిపించాలని కోరినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి.ఉమేష్ స్వయంగా మీడియా కి వివరించారు. వీడియో లు ఉన్నాయి.అసలు కోవిడ్ వైద్యం చేయడానికి ఆస్పత్రికి ఉన్న అనుమతులు విషయం పై అనుమానం ఉన్నాయి..ఇన్ని ఉండగా గ్రామీణ వైద్యులు సంఘం పేరుతో కొంతమంది, ఒక న్యాయవాది బాధితుడు ను అరెస్ట్ అది కూడా కరోన పేషేంట్ ని అరెస్ట్ చేయమన డం వెనుక అనుమానం ఉన్నాయి..ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఇప్పటికే అరెస్ట్ విషయాన్ని ఖండించారు.. ఇది ఇలా ఉంటే ఆస్పత్రి లో కోవిడ్ వైద్యం చెయ్యడానికి ఉన్న అనుమతులు ఏంటో గ్రామీణ వైద్యులు సంఘం నాయకులు తెలపాలి అని స్థానికులు కోరుతున్నారు..గ్రామీణ వైద్యుల ముసుగు లో కొంత మంది ఆస్పత్రులు యజమానులు కు దళారులు గా వ్యవహారించటం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు.. ఆస్పత్రులు నుండి కమీషన్ విషయం నిజం కాదా అనే అభిప్రాయ ము వ్యక్తం అవుతోంది.తమ ఆదాయవివరాలు బ్యాంకు ఖాతాను గ్రామీణ వైద్యులు ముసుగు లో ఉన్న వారు బహిర్గతం చేసి జనం ముందు పెడితే ఏ హాస్పటల్ నుండి ఎంత మొత్తం అందింది బైటకు వస్తుంది అన్న డిమాండ్ కూడా ఉంది.
ఉమేష్ డబ్బులు ఇచ్చాడా,అడిగారా లేదా అన్నది ఆస్పత్రి సిసి కెమెరాలు పరిశీలన చెయ్యాలి అని కోరుతున్నరు..క్యాబినెట్ మంత్రి కేటీఆర్ కు అందిన పిర్యాదు పై విచారణ జరిగే వరకు కూడా ఓపిక లేకుండ పిల్ల వాడి పై, కరోన పేసేంట్ పై విమర్శ లు చెయ్యడం,భయపెట్టడం వైద్య నిపుణులుకూడా సరి కాదు అంటున్నారు..మంత్రి నే మోసం చేసాడు అనే పదం వాడటం పై కూడా విమర్శలు వస్తున్నాయి.. ఇది ఇలా ఉంటే శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం అనుమానం కలిగిస్తుంది.. మొత్తం ఎపిసోడ్ ఆస్పత్రి యాజి మన్యం కనుసన్నల్లోనే జరుగుతోంది అని. ఆస్పత్రి వారిని సంప్రదింపులు చేసి విమర్శలు,అబండాలు అని సిసి కెమెరా లు పరిశీలించి, సమందిత వ్యక్తులు ఫోన్ కాల్ డేటా,వాయిస్ లు ,బ్యాంకు ఖాతాలుపరిశీలించి శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేస్తే వాస్తవాలు బైటకు వస్తాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తప్పుడు ఫిర్యాదు చేసిన ఉమేష్ ను చట్ట ప్రకారం శిక్షించాలి ::
గ్రామీణ వైద్యుల🩺డిమాండ్


డాక్టర్లు కూడా మానవత్వంవున్న మనుషులే.
“వైద్యోనారాయణోహరీ”
గౌరవ మంత్రివర్యులు కే టి ఆర్ గారికి మధిర లోని కేవిఆర్ ఆసుపత్రి పై ట్విట్టర్ లో ఫిర్యాదు చేసి, నేను హైదరాబాద్ లో రెమిడ్సివిర్ ఇంజెక్షన్ తెప్పించు
కున్నాను. రెండు మూడు సార్లు బిల్లులు కోసం తిరిగితే పట్టించుకోలేదు… అంటూ మీడియా ముందు చెప్పి, కేటీఆర్ గారికి తప్పుడు ఫిర్యాదు చేసిన సదరు ఉమేష్ ను చట్ట ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలని, ఇటువంటి వారిని వదిలేస్తే సమాజములో ప్రతివారు ఇలాగే తప్పుడు ఫిర్యాదు చేసి బ్లాక్ మెయిల్ చేసి, తద్వారా సమయాన్ని వృధా చేసి,డబ్బులు గుంజే అవకాశం వుందని పోలీసు అధికారులను మీడియా ద్వారా కోరారు. సాక్షాత్తు మంత్రి గారినే తప్పుదోవ పట్టించిన వ్యక్తి భవిష్యత్తులో ఇలా సోషల్ మీడియాని ఉపయోగించి మెాసాలకు పాల్పడే అవకాశం వుందని ఆరోపించారు. వెంటనే మధిర పోలీసు అధికారులు సుమెాటోగా స్పందించి సదరు ట్విట్టర్ లో తప్పుడు ఫిర్యాదు చేసిన ఉమేష్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.+మస్తాన్ పాషా🩺
గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా కార్యదర్సి

ఉమేష్ పై చర్యలు ఎందుకు తీసుకోవాలి…

SFI ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు …*

తను కెటీర్ కు రెమడీస్ వేర్ ఇంజక్షన్లు ఒకటి 30 వేల రూపాయలు చొప్పున తీసుకున్నారు.. అని కంప్లైంట్ చేయటం తప్పు అవ్వొచ్చు..

  కానీ....

*ఉమేష్ ని అరెస్ట్ చేయాలని వాట్సాప్ లో పోస్ట్ లు పెడుతున్నరూ…

దీనిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోంది… స్వతంత్రంగా ఎవరిమీదైనా కంప్లయింట్ చేసే అధికారం ప్రజలకు ఉంది..

తను తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకు పోతుంది…

s s consultancy

అంతే కానీ ఉమేష్ ని అరెస్ట్ చేయాలి అని బెదిరించే పోస్ట్ పెట్టటాన్ని SFI తీవ్రంగా ఖండిస్తుంది…

తప్పుడు ఫిర్యాదు చేసిన ఉమేష్ ను చట్ట ప్రకారం శిక్షించాలి :::: న్యాయవాది రామరాజు డిమాండ్


గౌరవ మంత్రివర్యులు కే టి ఆర్ గారికి మధిర లోని కేవిఆర్ ఆసుపత్రి పై ట్విట్టర్ లో ఫిర్యాదు చేసి, నేను హైదరాబాద్ లో రెమిడ్సివిర్ ఇంజెక్షన్ తెప్పించు
కున్నాను. రెండు మూడు సార్లు బిల్లులు కోసం తిరిగితే పట్టించుకోలేదు… అంటూ మీడియా ముందు చెప్పి, కేటీఆర్ గారికి తప్పుడు ఫిర్యాదు చేసిన సదరు ఉమేష్ ను చట్ట ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలని, ఇటువంటి వారిని వదిలేస్తే సమాజములో ప్రతివారు ఇలాగే తప్పుడు ఫిర్యాదు చేసి బ్లాక్ మెయిల్ చేసి, తద్వారా సమయాన్ని వృధా చేసి,డబ్బులు గుండె అవకాశం వుందని సీనియర్ న్యాయవాది చావలి రామరాజు పోలీసు అధికారులను మీడియా ద్వారా కోరారు. సాక్షాత్తు మంత్రి గారినే తప్పుదోవ పట్టించిన వ్యక్తి భవిష్యత్తులో ఇలా సోషల్ మీడియాని ఉపయోగించి మెాసాలకు పాల్పడే అవకాశం వుందని సదరు న్యాయవాది రామరాజు ఆరోపించారు. వెంటనే మధిర పోలీసు అధికారులు సుమెాటోగా స్పందించి సదరు ట్విట్టర్ లో తప్పుడు ఫిర్యాదు చేసిన ఉమేష్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు

కె వి ఆర్ ఆసుపత్రి సంఘటనపై విచారణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు

మధిర లోని కె.వి.ఆర్ జనరల్ హాస్పిటల్ పై రెమిడీ సివర్ ఇంజెక్షన్ కొనుగోలు విషయమై పారదర్శకమైన విచారణ నిర్వహించాలని కోరుతూ మధిర కు చెందిన సీనియర్ జర్నలిస్టు సాదు విజయ్ శుక్రవారం పట్టణ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా పెనుగొలను గ్రామానికి చెందిన సుగ్గల ఉమేష్ అనే యువకుడు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతా కు మధిర లోని కె.వి.ఆర్ ఆస్పత్రిపై ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఫిర్యాదు లో పేర్కొన్న సంఘటనకు విరుద్ధంగా శుక్రవారం మీడియా ఎదుట ఈ సంఘటనపై విరుద్ధమైన ప్రకటన చేయడం ఆసుపత్రి యాజమాన్యంపై వైద్యులపై అనవసరంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొనడం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనపై పారదర్శకమైన విచారణ నిర్వహించి యధార్ధత ను ప్రజలకు వెల్లడించాలని, రేమిడిసివేర్ ఇంజక్షన్ల కొనుగోలులో జరిగిన వ్యవహారాలను నిగ్గు తేల్చాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సాదు విజయ్ ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు మధిర పట్టణ ప్రొబేషనరీ ఎస్ ఐ షాకీర్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఫిర్యాదుపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపినట్లు విజయ్ తెలిపారు

sarpanch demand

స్వేచ్ఛ ఉందని తప్పుడు సమాచారాలు ఇచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గారు బిజీగా ఉండే విషయం ప్రపంచమంతటికీ తెలుసు బిల్లు విషయములు ఆలస్యమైందని హాస్పిటల్ పై డాక్టర్ పై బురద జల్లే ప్రయత్నం లో గౌరవ మంత్రివర్యులు కు తప్పుడు సమాచారం ఇచ్చిన ఉమేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడున్న ప్రమాదకర పరిస్థితుల లో బిల్లు కంటే వైద్యం ముఖ్యం కాబట్టి బిజీగా ఉన్న సమయంలో ఉమేష్ పరిస్థితి అర్థం చేసుకోకుండా ట్విట్టర్లో పంపటం మళ్ళీ తర్వాత నిజాన్ని ఒప్పుకోవడం క్షమించరాని నేరం ఈ విషయాన్ని సమాజ అర్థం చేసుకోవాలి

ఇట్లు

ఇల్లూరు సర్పంచ్
కోట రామారావు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.