పోలీసులతో దురుసుగా ప్రవర్తించి నవ్యక్తుల అరెస్టు

0
TMedia (Telugu News) :
s s consultancy

మద్యం మత్తులో గోదావరిఖని బ్రిడ్జి వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వీరంగం సృష్టించిన మధ్యప్రదేశ్ కు చెందిన ఐదుగురు వ్యక్తుల అరెస్టు,రిమాండ్ కు తరలింపు.
టి మీడియా //రామగుండం //పెద్దపల్లి జిల్లా.
గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జి వద్ద ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా చెక్పోస్ట్ పెట్టి ప్రభుత్వం సూచించిన సమయం లో వాహనాల అనుమతి పత్రాలను తనిఖీ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఒక క్యాంపర్ వాహనం ఆపి ప్రయాణిస్తున్న వారిని అనుమతి పత్రం అడగగాఎలాంటి అనుమతి లేకుండా,కోవిడ్19 నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు1. మహేందర్ సింగ్,ఎస్/ఓ. మంగల్ సింగ్,28 సంవత్సరాలు2. పుష్ప రాజ్ సింగ్,ఎస్/ఓ.జై భాను సింగ్, 22 సంవత్సరాలు,3. సహదేవ సింగర్,ఎస్/ఓ. ప్రేమ్ లాల్ సింగ్,30 సంవత్సరాలు,4. బలి మాన్ సింగ్,ఎస్/ఓ.కుంజల్ సింగ్,24 సంవత్సరాలు,5.అశోక్ సింగ్,ఎస్/ఓ.బీర్ బహదూర్ సింగ్, 22 సంవత్సరాలు.అనువారు మద్యం మత్తు లో విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, విధులను ఆటంకపర్చినారు.వారు సుశీ అనే ఓబి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. వారిపై గోదావరిఖని టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్ కు పంపడమైనది.ప్రభుత్వం సూచించిన సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తప్ప మిగతా సమయంలో అనుమతి లేకుండా ఎవరు బయట తిరిగినను వారిపై చట్టపరంగా కోవిడ్19 నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని,ప్రజలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి,బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్క్ ధరించి షాప్ ల వద్ద భౌతిక దూరాన్ని పాటించాలి,సానిటైజర్ ఉపయోగిస్తూ దగ్గర దగ్గరగా, గుంపులు గుంపులుగా తిరిగి కరోనామహమ్మారిని కొనితెచ్చుకోవద్దని ప్రజలకు గోదావరిఖని టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు సూచించారు.పోలీసులు 24 గంటలు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు విధులు నిర్వర్తిస్తూ ఓపికతో సహనం కోల్పోకుండా గోదావరి బ్రిడ్జి పై విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ హరిదాసు వెంకటరమణ,కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి, బొబ్బిలి సంతోష్, ఉనుగొండ మహేష్ లను పెద్దపల్లి డిసిపి రవీందర్  మరియు గోదావరిఖని ఎసిపి ఉమెందర్ అభినందించారు.లాక్డౌన్ అనేది ప్రజల మంచి గురించేనని గమనించి ప్రజలు ఎవరూ అనుమతి లేకుండా ప్రభుత్వం సూచించిన సమయంలో తప్ప ఇతర సమయాలలో బయట కు రావద్దని పెద్దపల్లి డి సి పి రవిందర్  మరియు గోదావరిఖని ఎసిపి ఉమెందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలిపినారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.