ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న నిందుతులను పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

0
TMedia (Telugu News) :

..

రెమ్డిసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న నిందుతులను పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

హైదరాబాదు నుండి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఖమ్మం సరిహద్దులో అదుపులోకి తీసుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలింపు….

నిందుతుల నుండి ఐదు రెమ్డెసివిర్ వైల్స్ స్వాధీనం

కరోనా రోగుల అత్యవసర వైద్యం కోసం వాడే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందాను కట్టడి చేసేందుకు దృష్టి సారించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు రంగంలోకి దింపి దిశానిర్దేశం చేశారు.

s s consultancy

ఈ క్రమంలో రెమ్డిసివిర్ ఇంజెక్షన్ల హైదరాబాదు నుంచి అక్రమంగా తరలిస్తునట్లు సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామనుజం , ఎస్సై ప్రసాద్, తమ సిబ్బందితో ఖమ్మం సరిహద్దు నాయకన్ గూడెం వద్ద నిఘా పెట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న ఐదు రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను పట్టుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వివరాలు వెల్లడించారు.

పధకం ప్రకారం ఒక్కొక్క ఇంజెక్షన్ 32 వేలకు కొవిడ్ బాధితులకు విక్రయించేందుకు
ఘట్కేసరి మండలం
నారాపల్లి గ్రామానికి చెందిన
నల్లెదా తిరుమల్ రెడ్డి అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌లో వున్న మెడికల్ షాప్ లో ఐదు రెమ్‌డెసివిర్ వైల్స్ ను తీసుకొని
ఖమ్మంలోని ప్రవేటు ఆసుపత్రి పిఆర్వో పనిచేస్తున్న అకారాపు నిరంజన్ కు ఖమ్మం సరిహద్దులో అప్పగించేందుకు AP10 BG 1113 నెంబరు గల తన కారులో హైదరాబాదు నుండి బయలుదేరి ఖమ్మం సరిహద్దులో చేరుకొని
అకారాపు నిరంజన్ కు అప్పగిస్తున్న సమయంలో దాడిచేసి పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.
నిందుతులను అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యల నిమిత్తం కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.