రెమిడెసివర్ బ్లాక్ దందాపై రామగుండం సి పి కొరడా.

0
TMedia (Telugu News) :

రెమిడెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందాపై రామగుండం సి పి సత్యనారాయణ కొరడా.

 మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్ ల కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ ల ద్వారా సాగుతోన్న దందా

 ఏసిపి అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో గుట్టు రట్టు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని , ఒక అంబులెన్స్, 5 రెమిడీసివర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్న మంచిర్యాల పోలీసులు మరియు రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ టీమ్.

 కరోనా భాదితుల వీక్ నెస్ క్యాష్ చేసుకుంటూ…..నెల రోజులుగా సాగుతోన్న దందా.

 మంచిర్యాల లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఇద్దరు సిబ్బంది మరియు ఇద్దరు అంబులెన్స్ యజమానులు కలసి ఒక గ్రూపుగా ఏర్పడి బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు.

 ఒక్కో ఇంజక్షన్ కు రూ 25 నుంచి రూ 30 వేల వరకు అమ్ముతున్న కేటుగాళ్లు.

s s consultancy

 ఈ ముఠా ఇప్పటివరకు బ్లాక్ లో చాలా ఇంజక్షన్స్ అమ్మినట్టు పోలీసుల విచారణ లో వెల్లడి.

మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారు మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో పత్రిక సమవేశం ఏర్పాటు చేసి రెమిడెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందా కు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు.
అటు పోలీసులు ఇటు ప్రభుత్వం పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నా..రెమ్‌డెసీవిర్ ఇంజక్ష దందా మాత్రం ఆగడం లేదు. మెడికల్ మాఫియాలు కరోనా రోగుల బలహీనతను ఆసరా చేసుకుని వేల రూపాయల దోపిడికి పాల్పడుతున్నారు అన్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఆస్పత్రిలో పనిచేసే మేనేజర్లు మరియు అంబులెన్స్ డ్రైవర్లు ఒక ముఠాగా ఏర్పడి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రెమిడి సివియర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ సిఐ ముక్తి లింగయ్య మరియు టాస్క్ఫోర్స్ సిఐ రాజకుమార్ లతో ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసి ఇంజెక్షన్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది.

నేర విధానం
కోవిడ్ బారినపడి చికిత్స నిమిత్తం కేర్ ఆస్పటల్ మరియు పల్స్ హాస్పిటల్ కి వచ్చిన కరోనా బాధితుల వివరాలను సేకరించి వారికొచ్చిన కరోనా పాజిటివ్ మెసేజ్ మరియు ఆధార్ కార్డు వివరాలను బాధితుల దగ్గర నుండి తీసుకొని మీకు రెమిడీసివర్ ఇంజక్షన్ ఇప్పిస్తామని చెప్పి నకిలీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తయారుచేసి హైదరాబాదులోని వీరికి తెలిసిన వ్యక్తులకు పంపించి ఒక్కో పాజిటివ్ పేషెంట్ పేర్లమీద ఆరు ఇంజక్షన్ చూపించడం జరుగుతుంది. బాధితులకు మాత్రం అక్కడ స్టాక్ అయిపోయిందని దొరకడం లేదని మీరు వేరే దగ్గర ప్రయత్నించామని చెప్పడం జరుగుతుంది.మరల వారికి ఫోన్ చేసి నాకు తెలిసిన వారి వద్ద రెమిడీసివర్ ఇంజక్షన్ లు ఉన్నాయి అని గొట్టే రాజేందర్ (హెల్త్ కేర్ హాస్పిటల్) అనే వ్యక్తి బాధితులకు చెప్పి వారు 25 వేల నుండి 30 వేల రూపాయలు అడుగుతున్నారని మీకు ఓకే అంటే తెప్పిస్తాను అని వారు ఓకే అనగానే పల్లె రమేష్ (పల్స్ హాస్పిటల్) అనే వ్యక్తికి చెప్పగా సదర్ వ్యక్తి అంబిలెన్స్ డ్రైవర్ లైన పులి సంతోష్ మరియు పున్నం రంజిత్ లకు రెమిడీసివర్ ఇంజెక్షన్లు ఇచ్చి బాధితుల దగ్గరికి పంపించడం జరుగుతుంది. వీరిద్దరి లో ఒకరు ముందుగా బాధితుల వద్దనుండి నగదు రూపేణా డబ్బులు ముట్టిన తర్వాత మరొక వ్యక్తి అంబులెన్స్ నుండి ఇంజక్షన్స్ ని తీసుకువచ్చి వారికి అప్పగించడం జరుగుతుంది. ఇలా వచ్చిన డబ్బులను నలుగురు పంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా హాస్పిటల్ లో ఉన్నటువంటి బాధితుల వివరాలు సేకరించి వారిలోని భయాన్ని మరియు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.
కోవిడ్ నేపథ్యంలో రేమీడిసివేర్ ఇంజక్షన్ లను బ్లాక్ చేస్తూ అక్రమ దనార్జనకు పాల్పడుతున్న ముఠా వివరాలు:

(1) పులి సంతోష్ s/o మోహన్, R/o తిర్యాని,
(2) గొట్టే రాజేందర్ S/o జనార్దన్ R/o మండమర్రి,
(3) పల్లె రమేష్ s/o వెంకటి R/ o బెల్లంపల్లి,

పరారీలో ఉన్న నిందితుడు.
(4) పుణ్ణం రంజిత్ కుమార్ s/o సమ్మయ్య R/o మంచిర్యాల
ఈ నలుగురూ కలిసి బ్లాక్ లో రేమీడిసివేర్ ఇంజక్షన్ లను బ్లాక్ చేస్తూ ఒక్కో దానికి 30,000 రూపాయల కు విక్రయిస్తుండగా నిఘా వేసి మంచిర్యాలలో పట్టుకున్నట్లు తెలిపారు.కరోన విలయ తాండవం చేస్తున్న సమయంలో రోగులకు అవసరం అయ్యే రేమీడిసివేర్ ఇంజక్షన్ లను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు…రేమిడిసివర్, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి…
కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలలో ప్రభుత్వం, వైద్య శాఖ నిర్ణయించిన ధరల ప్రకారమే ఛార్జ్ చేయాలని ఏసీపీ గారు సూచించారు.

ఏసీపీ గారు మాట్లాడుతూ…. ప్రతి ఆసుపత్రిలో ధరల పట్టిక విషయంలో ప్రతి ఆసుపత్రి విధిగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ప్రజారోగ్యం విషయంలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలలో ప్రభుత్వం, వైద్య శాఖ నిర్ణయించిన ధరల ప్రకారమే ఛార్జ్ చేయాలని ఏసీపీ గారు సూచించారు.
👉విపత్కర పరిస్థితులలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
👉ఆసుపత్రుల యాజమాన్యాలు సైతం ఇలాంటి కష్ట కాలంలో వ్యాపార ధోరణితో కాకుండా కొంత సేవాభావాన్ని ప్రజలకు వైద్యం అందించాలని కోరారు.
రికార్డులు మాయం చేసే అసూపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని అవసరమైతే ఆసుపత్రులను సీజ్ చేయడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.
👉రేమిడిసివర్ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉన్నదని, కొంత మంది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు .
👉 సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు.
👉హెచ్.ఆర్.సి.టి. స్కాన్ 3,500 రూపాయలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు

నకిలీ దందా కి పాల్పడుతున్న నిందితులను పట్టుకొన్న మంచిర్యాల పట్టణ సిఐ ముత్తి లింగయ్య ,టాస్క్ ఫోర్సు సి రాజ్ కుమార్ ,టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్ ,సదానందం,వెంకటేష్,రాకేశ్,శ్రీనివాస్,ఓంకార్ లను సిపి గారు ప్రత్యేకంగా అబినందించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.