నకిలీ విత్తనాల మాఫీయా నిందితుల పట్టివేత,

0
TMedia (Telugu News) :

. నకిలీ విత్తనాల మాఫీయా పై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఉక్కు పాదం….

టీ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా, మే 03

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీవిత్తనాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి రామగుండము పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ (డిఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ మరియు జైపూర్ పోలీసుల సంయుక్త తనిఖీలు.

ముగ్గురు నిందితుల పట్టివేత, ఒకరి పరారీ

సుమారు 3 లక్షల రూపాయల విలువగల నిషేధిత పత్తి విత్తనాల పట్టివేత .
ఒక అపాచీ బైక్ (ఏపి 23ఏబి 3883)
ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ (ఎపి 19డి 1779)
మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
నిందితుల వివరములు:

s s consultancy

1) మాకినేని రాఘవేంద్ర, తండ్రి. వెంకట నారాయణ, హైటెక్ సిటీ, మంచిర్యాల.

2) పులికొండ యశ్వంత్ కృష్ణ, తండ్రి. లోకేశ్వరరావు, సంజీవయ్య కాలనీ మంచిర్యాల్.

3) జునారీ.సుభాష్, తండ్రి. రాజయ్య , సంజీవయ్య కాలనీ, మంచిర్యాల

పరారీలో ఉన్న నిందితుడు

అద్దంకి నాగేశ్వర రావు, యూరియా నాగేశ్వర రావు.
గుంటూరు.

పరారీలో ఉన్న నిందితుడు అద్దంకి నాగేశ్వరరావు ఆంధ్ర నుండి నకిలీ విత్తనాలను సరుకు రవాణా చేసే లారీల ద్వారా రహస్యంగా తెప్పిస్తూ, మంచిర్యాలలో ఉన్న మాకినేని రాఘవేంద్ర, పులికొండ యశ్వంత్ ద్వారా రైతుల వద్దకు రహస్యంగా రవాణా చేస్తూ లబ్ధి పొందడం జరుగుతుంది.
ఇదే క్రమంలో ఈరోజు యశ్వంత్ కృష్ణ ఆటో లో ఆటో డ్రైవర్ సుభాష్ మరియు యశ్వంత్ కృష్ణ జనుము సంచుల మాటున నకిలీ పత్తి విత్తనాలు దాచి రహస్యంగా చెన్నూరు ప్రాంతానికి తరలిస్తుండగా, రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు జైపూర్ పోలీసులు పక్కా సమాచారంతో ఇందారం ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించి అశోక్ లేలాండ్ వాహనంలో నకిలీ పత్తి విత్తనాలు తీసుకు వెళ్తున్న యశ్వంత్ కృష్ణ మరియు సుభాష్ లను, బైక్ పై ఎస్కార్ట్ గా వెళ్తున్న రాఘవేంద్ర లను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
అదుపులోకి తీసుకున్న నిందితులను మరియు స్వాధీన పరచుకున్న వాహనాలను, మరియు సెల్ ఫోన్ లు తదుపరి విచారణ నిమిత్తం జైపూర్ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడి చేయడం జరుగుతుంది.
కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుండి నకిలీ పత్తి విత్తనాలు మరియు నిషేధిత గడ్డి మందు అక్రమ రవాణా చేసే స్మగ్లర్ లు తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల వాహనాలను పోలీస్ లు ఆపరని ,చెక్ చేయరని లారీలలో, వ్యాన్లలో రహస్యంగా వీటిని తరలిస్తున్నారు. మారుమూల గ్రామాలలో నిల్వ చేసి రైతులకు రహస్యంగా అమ్ముతున్నారు. నకిలీ విత్తనాల అక్రమ రవాణా చేయడానికి స్మగ్లర్లు కొత్త కొత్త ఆలోచనల తో పథకాలు వేస్తున్నా వారి అంచనాలకు అందకుండా రామగుండము కమీషనరేట్ టాస్క్ ఫోర్సు, పోలీసులు ప్రజల సహకారంతో ,ఆధునాతన సాంకేతిక పద్దతుల ద్వారా వారి కదలికలను గుర్తించి ఈ నకిలీ వ్యాపారం జరగకుండా దాడులు నిర్వహిస్తూ అడ్డుకట్ట వేయడం జరుగుతుంది.వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపడం జరుగుతుంది.నకిలీ విత్తనాల అక్రమ రవాణా చేసేవారి మరియు గ్రామీణ స్థాయి నుండి సకహరించే వారి పూర్తి వివరములు సేకరించడం జరిగింది. అలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేసి, వరుస దాడులు నిర్వహిస్తామని తెలిపారు.రైతుల కష్టాన్ని దోచుకుంటు అక్రమ వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలేది లేదు.. ఇంకా ఈవ్యహారంపై పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నాం. వ్యవసాయ శాఖ అధికారుల సహాయం కూడా తీసుకుంటూ అందరిపై కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ యాక్టు నమోదుకు వెనకాడేది లేదు.
ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ సి ఐ ఏ.కే మహేందర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, జైపూర్ ఎస్సై రామకృష్ణ, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది
సదానందం గౌడ్,శ్రీనివాస్ ,
వెంకటేష్,భాస్కర్ గౌడ్
సంపత్ కుమార్ లు పాల్గొన్నారు.
[19:22, 6/3/2021] శనగపాటి మురళీకృష్ణ: https://www.tmedia.net.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.