గుప్తనిధుల కోసం, తవ్వకాలు జరిపే ముఠాను అరెస్ట్

0
TMedia (Telugu News) :

గుప్తనిధుల కోసం, తవ్వకాలు జరిపే ముఠాను అరెస్ట్

టి మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా, జూన్ 01
తవ్వకాలకు వెళ్తున్న సమయంలో పక్కా సమాచారంతో కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఒక ఆటో, పూజ సామాగ్రి,సెల్ ఫోన్లు స్వాధీనం.
రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ వి.సత్యనారాయణ.ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ ఏ.కే.మహేందర్ వారి సిబ్బంది తో కలిసి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది గుప్తనిధుల వేటగాళ్లు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే పక్కా సమాచారంతో తాళ్ల రెబ్బన గ్రామ శివారులోనీ నేన్నేల – కన్నేపల్లి రహదారిలో అనుమానాస్పదంగా వెళుతున్న ఆటోని ఆపి తనిఖీ చేయగా, గుప్తనిధుల కోసం సంచరిస్తున్న 4 గురు నిందితుల ముఠా గా గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.వారిని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కొంచవెళ్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడానికి వెళుతున్నట్టు చెప్పడం జరిగింది. గత కొంత కాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినట్టు చెప్పగా, వారి సెల్ ఫోన్ లోని ఫోటోలు,వీడియోల సమాచారం ఆధారంగా కన్నెపల్లి మండలం వెంకటాపూర్ అటవీ ప్రాంతం లో కూడా తవ్వకాలు జరిపినట్టు తెలుస్తుందని, తదుపరి విచారణ నిమిత్తం నలుగురు నిందితులను, వారి వద్ద నుండి స్వాధీన పరచుకున్న పూజా సామాగ్రి , పూజకు ఉపయోగించే రుద్రాక్ష దండలు, నిమ్మకాయలు , సెల్ ఫోన్లు, ఒక ఆటో ని కన్నేపల్లి పోలీస్ స్టేషన్ కి అప్పగించడం జరిగింది.
పట్టుపడిన వారి వివరాలు.
1).కొప్పర్తి ప్రశాంత్
సిసి నస్పూర్ .
2).రేగుంట నారాయణ
ముదిగుంట , జైపూర్
3).చిప్పకుర్తి మహేష్,
4). కోడి .తిరుపతి
మంచిర్యాల

s s consultancy

పరారీ లో ఉన్న నిందితుడు.

1).మల్లేష్ a/o. నేపాల్ స్వామి ,ఓల్డ్ బెల్లంపల్లి .

ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్
సీఐ ఏకే మహేందర్
ఎస్ఐ లచ్చన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, శ్యామ్ సుందర్,సదానందం గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్,
భాస్కర్ గౌడ్ , రాకేషలను, ఓంకార్ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.