బాలిక పైఅత్యాచారం.. హత్య చేసిన నిందితుడు అరెస్ట్,

0
TMedia (Telugu News) :
s s consultancy

మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు అరెస్ట్,

ద్విచక్ర వాహనం(TS 28 F 1320)  ఒక సెల్ పోన్ స్వాధీనం
నేరస్థుడి వివరాలు:
ధరమ్ సోత్ రాజేష్, S/o. మంగీలాల్, వయసు 22 సం., డిగ్రీ 3rd year,R/o.తండా ధర్మారం, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా.
తేదీ 29.05.2021 శనివారం రోజున  మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాంపురం తండా వద్ద ఒక గిరిజనబాలికను తండా ధర్మారం కు చెందిన ధరంసోత్ రాజేష్
S/o.మంగీలాల్ అనే వ్యక్తి పెట్రోల్ బంకు దగ్గర లోని మొండికట్ట గుట్టలో అత్యాచారం చేసి హత్య చేశాడని ఫిర్యాదు చేయగా,బాలికపై అత్యాచారం మరియు హత్య గా  కేసు నమోదు చేసుకొని  మరిపెడ పోలీసులు  విచారణ ప్రారంభించగా,
విచారణలో (మృతురాలు)   బాలిక మరియు నేరస్థుడు రాజేష్ ఒకే గ్రామపంచాయతీ లోని ప్రక్క ప్రక్కతండా వాసులు గత మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య  పరిచయం ఏర్పడి, అప్పటి నుండి ఇద్దరూ చనువుగా ఉంటూ అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవారుబాలిక అయిన మృతురాలిని ఆమె పెద్దనాన్న పెంచుతున్నాడు వారికి చెందిన చిన్న డబ్బా కొట్టు essar పెట్రోల్ బంకు ముందు ఉండగా రాజేష్  అక్కడకొచ్చి అప్పుడప్పుడు బాలిక తో మాట్లాడుతూ ఉండేవాడు. అదే క్రమంలో నేరస్తుడు కొన్ని రోజులుగాబాలికను ఒంటరిగా  బయట ఎక్కడైనా కలుద్దాం అని అడుగుతూ ఉండేవాడు.
అదే క్రమంలో గత నాలుగు రోజుల క్రితం బాలిక తన అక్క తో తండా ధర్మారంకు చెందిన ధర్మసోత్ రాజేష్ అనే వ్యక్తిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బాలిక చెప్పగా మృతురాలి అక్క ముందు నువ్వు చదువుకో నీది చిన్న వయసు అని తిరస్కరించింది. ఆ తర్వాత తన పెదనాన్న కొడుకు మోహన్  అతని సొంత అక్క కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్ లో ట్రీట్మెంట్ కొరకు 27 వ తేదీన వెళ్లగా ఈ విషయాన్ని మృతురాలు రాజేష్ కి చెప్పినది. ఇదే అదునుగా చూసుకొని రాజేష్ నిన్నటి రోజున సుమారు 12.00 గంటల సమయంలో మైనర్ బాలికతో ఫోన్లో మాట్లాడి మీ ఇంట్లో ఎవరు లేరు కదా మనిద్దరం కలుద్దాము అని మైనర్ బాలికను ఒప్పించి బాలిక ఇంటికి దగ్గర్లో ఉండే మొండి కట్టు బోడు(గుట్ట) కు రావాలని చెప్పగా తను అక్కడికి నడుచుకుంటూ వచ్చినది. ఇదే సమయంలో నేరస్థుడు తన ద్విచక్ర వాహనం మీద పెట్రోల్ బంక్ కి చేరుకోగానే అక్కడ పెట్రోల్ బంక్ లో పని చేసే కోటి అనే వ్యక్తికి  నా బైక్ వేప చెట్టు కింద పెట్టి మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తాను అని చెప్పి రోడ్డు దాటి గుట్ట వైపుకు వెళ్ళినాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న బాలికతో కలిసి ఇద్దరూ గుట్ట పైకి వెళ్లి ఒక బండరాయి మీద కూర్చొని కొద్దిసేపు మాట్లాడారు.. ఆ వెంటనే నేరస్తుడు,మైనర్ బాలికను శారీరకంగా కలుద్దాము అని అడగగా మృతురాలు భయమేస్తుంది. నేను ఎప్పుడూ అలా చెయ్యలేదు అని చెప్పగా , రాజేష్ బలవంతంగా ఒప్పించి అత్యాచారం చేస్తుండగా  నన్ను వదిలేయ్ అని చెప్పినా వినకుండా బలవంతంగా గట్టిగా పైకి ఒక్కసారిగా లేపడం వల్ల కింద బండకు తల బలంగా గుద్దుకున్నది. అదే సమయంలో మైనర్ బాలికకు రక్తస్రావం విపరీతంగా అవుతున్నప్పటికీ పట్టించుకోకుండా నేరస్తుడు అత్యాచారం చేయగా మైనర్ బాలిక స్పృహ తప్పి పోయినది .
ఆ తర్వాత నేరస్థుడు రాజేష్ ఇదే విషయాన్ని శ్రీను  అనే వ్యక్తికి  ఫోన్ చేసి చెప్పగా శ్రీను, బాలిక సొంత బావ అయినా శంకర్ కి ఫోన్ చేయగా వెంటనే అక్కడకు వచ్చి శ్రీను మరియు శంకర్ లు బండి పై పురుషోత్తమాయ గూడెం లోని ఆర్ఎంపీ కళాధర్ వద్దకు తీసుకొని పోయి చూపించగా మైనర్ బాలిక చనిపోయినట్లుగా చెప్పడం జరిగింది. అప్పటినుండి నిందితుడు రాజేష్ పరారీలో ఉండగా ఈరోజు  పక్కా సమాచారంతో ఎల్లారిగూడెం స్టేజ్ వద్ద ధరమ్ సోత్ రాజేష్ అరెస్టు చేసి తన వద్ద గల పల్సర్ వాహనం మరియు సెల్ ఫొన్ ను స్వాధీనం చేసుకొవడం జరిగింది. కేసు వివరాలను మహబూబాబాద్ జిల్లాఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.