బైక్ దొంగల అరెస్ట్

0
TMedia (Telugu News) :

బైక్ దొంగల అరెస్ట్.

s s consultancy

రెండు బైకులు స్వాధీనం
ఇద్దరు నిందితుల అరెస్ట్.

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా,మే29

లక్షెట్టిపేటలోఇద్దరు బైక్ దొంగలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం ఈనెల 15 తారీకు నుండి 22తారీకు మధ్యలో ఉత్కూర్ చౌరస్తా వద్ద గల సాయి సాకేత్ ఆసుపత్రి ముందు గడికొప్పుల సాయి సన్నిత్ అనే వ్యక్తి తన బైక్ పార్క్ చేసి పెట్టగా గుర్తు తెలియని వ్యక్తులు ఏపి01ఎన్0077 యమహా ఆర్15వి2 దొంగిలించి నట్లు పిర్యాదు చేసారు. ఇట్టి పిర్యాదు మేరకు ఎస్సై దర్యాప్తు చేపట్టగా ఈరోజు ఉత్కూర్ చౌరస్తాలో పిసి తిరుపతితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా మంచిర్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న బైక్ ను అపి విచారించగా బైక్ పైవున్న జగిత్యాల జిల్లా పెద్ద నక్కలపేట గ్రామానికి చెందిన నిందితులు దుర్గం వంశీ, నీలం అభిషేక్ నేరం ఒప్పుకున్నారు. నిందితులను పూర్తిస్థాయిలో విచారించగా ఈబైక్ తో పాటు టిఎస్02ఇబి2414 నెంబర్ గలా షైన్ బైక్ కుడా దొంగిలించినట్లు నేరం ఒప్పుకోవడంతో రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాము. బైకుల విలువ సుమారు లక్ష యాబై వేలు ఉంటుందని ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచడం జరిగిందని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.