ల్యాబ్ నిర్వాహకులు అరెస్ట్:అనుమతులు లేకుండా టెస్టులుకారణం

0
TMedia (Telugu News) :

ల్యాబ్ నిర్వాహకులు అరెస్ట్:అనుమతులు లేకుండా టెస్టులుకారణం

s s consultancy

టీ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా,మే24

మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ ల్యాబ్ల్లో ఆదివారం ఏసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతిలేకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక డబ్బులు వసూలు చేస్తూ కొన్ని ప్రైవేట్ ల్యాబ్ లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… ఈ తనిఖీల్లో హెల్త్ కేర్ ల్యాబ్, పద్మావతి డయాగ్నొస్టిక్ సెంటర్ ల నుండి రూ. లక్ష 15 వేల విలువ చేసే 460 కోవిడ్ టెస్టింగ్ కిట్లు స్వాధీనం చేసుకున్నామని. వారిని విచారించగా వారికి పట్టణంలోని అమరావతి సర్జికల్, హజ్రత్ హర్షిత సర్జికల్స్ నుండి ఈ టెస్టు కిట్లు సరఫరా అయినట్లు తెలిసిందని. ఈ మేరకు హెల్త్ కేర్ ల్యాబ్ నిర్వాహకులు కామిని శ్రీనివాస్, బి.సాగర్, పద్మావతి డయాగ్నొస్టిక్ నిర్వాహకులు ఎం డి అజీమ్, ఎండి వజిమ్, అమరావతి సర్జికల్స్ గుడికందుల రాజేందర్, ఏ ప్రశాంతి లను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు.
లక్షెట్టిపేట, దండ పెళ్లి, జన్నారం లో కూడా ఇలాంటి అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఏసిపి ప్రకటించారు ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్ లింగయ్య సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.