ఎమ్మెల్యే చెన్నమనేని ఆధెశాల మేరకు యాచకులకు ప్రతి రొజు అన్నదానం

0
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే చెన్నమనేని ఆధెశాల మేరకు యాచకులకు ప్రతి రొజు అన్నదానం

s s consultancy

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,(మే 15):

కరోనా వ్యాధి వేగంగా ప్రబలిస్తున్న నేపథ్యం లో తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ముందర భిక్షాటన చేసుకునే యాచకుల ఆకలి తీర్చే ఉద్దేశంతో మున్సిపల్ పాలకవర్గం మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి యొక్క నిర్ణయంతో లాక్ డౌన్ ఎత్తి వేసే వరకు ప్రతిరోజు మధ్యాహ్నం గుడి ముందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనల మేరకు మా పాలకవర్గం అనుమతి తీసుకొని ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే షాపులు తీసి ఉండడం వలన యాచకులు ఆకలితో అలమటించ కూడదనే ఉద్దేశంతో ప్రతిరోజు మధ్యాహ్నం 1:00 గంటలకి ఉచితంగా దాదాపు 100 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మరియు అదేవిధంగా రాత్రి పూట కూడా భోజన వసతి ఏర్పాటు గురించి ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకపోగా తక్షణమే వారు స్పందించి ఆలయ అధికారులతో మాట్లాడి రాత్రిపూట కూడా 100 మంది యాచకులకు భోజన వసతి ఏర్పాటు చేపిస్తామని చెప్పడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో మున్సిపల్ పాలకవర్గం వారిచే భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని రాత్రిసమయంలో ఆలయ అధికారులతో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మారం కుమార్, గోలి మహేష్ వారి పెళ్లి రోజు సందర్భంగా అన్నపూర్ణ క్యాంటీన్ కి 1116 రూపాయల నగదు అందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.