అమ్మపరివార్ స్వచ్చంధ సేవా సంస్థ అన్నదాన కార్యక్రమం

0
TMedia (Telugu News) :

అమ్మపరివార్ స్వచ్చంధ సేవా సంస్థ లో అన్నదాన కార్యక్రమం

s s consultancy

టి మీడియా ప్రతినిధి/ గోదావరిఖని జూన్ 18

అమ్మపరివార్ స్వచ్చంధ సేవ సంస్థ నిర్వహిస్తున్న “నిరంతర అన్నదాన కార్యక్రమం” లో భాగంగా శుక్రవారం రోజు దాతగా డి.ఆర్.రామకృష్ణ ప్రసాద్-డి.ఆర్.సూర్య శ్రీ దంపతుల కుమార్తె “కీశే: కృతిక ” 10వ వర్ధంతి సందర్బంగా వారి తల్లిదండ్రులు కీశే:కృతిక ఆత్మ శాంతికొరకై అమ్మపరివార్ ఆశ్రమ చిన్నారులకు మరియు బయట నివసించే పేద వృద్దులకు,బిక్షటకులకు, భోజనం వండుకోలేక ఇబ్బంది పడేవారికి సుమారు 50-60 మందికి భోజన దాతగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అమ్మపరివార్ సంస్థ ఇన్ని సంవత్సరాలనుండి నిర్వహించే సేవలు మేము చూస్తున్నామని,శుక్రవారం రోజు తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అయన అన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన డి.ఆర్. రామకృష్ణ ప్రసాద్-డి.ఆర్. సూర్య శ్రీ దంపతులకు నిర్వాహకులు మంద నాగరాజు,ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పేస్ శ్రీవాస్,శివ కంప్యూటర్స్ నిర్వాహకులు శివ శంకర్,స్నుక రవి,ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.