వర్చ్యువల్‌ పద్ధతిలోపార్లమెంటరీసమావేశాలపై సంప్రదింపులు

0
TMedia (Telugu News) :

వర్చ్యువల్‌ పద్ధతిలో సమావేశాలపై సంప్రదింపులు..

కమిటీలతో ప్రారంభం

లోక్‌సభ స్పీకర్‌, అధికార్లతో వెంకయ్యనాయుడు చర్చలు

సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం

ఆచరణ సాధ్యమైతే అసెంబ్లీ సమావేశాలూ వర్చ్యువల్‌గానే..

s s consultancy

కరోనా నేపథ్యంలో అందరి జీవితాల్లో వర్చ్యువల్‌ విధానం విడదీయరాని భాగమైపోయింది. పిల్లల చదువుల దగ్గర్నుంచి, షాపింగ్‌లు, వినోదం, నిత్యావసర సరుకులు తెప్పించుకోవడం వరకు అన్నింటికీ ఆన్‌లైన్‌పైనే ఆధారపడటం తప్పనిసరైంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. దేశానికి అవసరమైన విధానాలను రూపొందించే పార్లమెంటు కూడా ఇదే బాటలో పయనించడానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో పార్లమెంటు సమావేశాలను కూడా వర్చ్యువల్‌ పద్ధతిలో నిర్వహించడానికి అడుగులు పడుతున్నాయి.

న్యూఢిల్లీ, మే 13: పేరెంట్‌ – టీచర్స్‌ మీటింగ్‌ల దగ్గర్నుంచి, పీఎం – సీఎంల సమావేశాల వరకు దేశం మొత్తం వర్చ్యువల్‌ విధానంపైనే ఆధారపడుతున్నప్పుడు శాసన వ్యవస్థ మాత్రం దీనికి మినహాయింపు ఎలా అవుతుంది? దేశం సంక్షోభంలో ఉన్న కీలక తరుణంలో చట్టాలు చేయడం, విధానాలపై చర్చలు ఆగిపోవాల్సిందేనా? అందుకే పార్లమెంటు సమావేశాలు కూ డా వర్చ్యువల్‌ పద్ధతిలో జరిగే రోజులు ఎంతోదూరం లో లేవని తాజా పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ దిశగా మొదట స్థాయీ సంఘాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత ఇదే పద్ధతిని పార్లమెంటు సమావేశాలకు విస్తరించే అవకాశం లేకపోలేదు.

వర్చ్యువల్‌ పద్ధతిలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించడంలో సాధ్యాసాఽధ్యాలను చర్చించడానికి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు గురువారం సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. కరోనా నేపథ్యంలో భౌతికంగా సమావేశాలు నిర్వహించడం వీలుకానందున, వర్చ్యువల్‌ విధానంలో పార్లమెంటరీ కమిటీలను సమావేశపరచాలని అనేకమంది ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ విషయం పై వెంకయ్య లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఇతర సీనియర్‌ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.

నిబంధనలు అడ్డంకి..!

వర్చ్యువల్‌ పద్ధతిలో సమావేశాలను నిర్వహించాల ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌, మరికొందరు సభ్యులు ఇటీవల రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. అయితే వర్చ్యువల్‌ పద్ధతిలో పార్లమెంటు సమావేశా లు నిర్వహించడానికి నిబంధనలు కొంత అడ్డొచ్చే అవకాశం ఉంది. పార్లమెంటరీ సమావేశాలు, చర్చలకు సభ్యులు భౌతికంగా హాజరుకావడం తప్పనిసరి. అలా గే పార్లమెంటు చర్చల గోప్యత (కాన్ఫిడెన్షియాలిటీ)కు సంబంధించిన నిబంధనలను కూడా సవరించాల్సి ఉం టుంది. ఇలాంటి సవరణలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరని నిపుణులు అంటున్నారు.

రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలు సవరిస్తే… అవి లోక్‌సభకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు భౌతికంగా సమావేశమయ్యే అవకాశం లేనందున రాజ్యాగ నిపుణులను సంప్రదించి ప్రత్యామ్నాయాలను ఆలోచించవచ్చు. ప్రతిపక్ష పార్టీలు కూడా వర్చ్యువల్‌ సమావేశాలకు సానుకూలంగా ఉన్నాయి. యూకే నుంచి పాకిస్తాన్‌ వరకు అనేక దేశాల్లో వర్చ్యువల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారని, మనదేశంలోనూ ఎలాం టి ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఉభయసభ ల అధిపతులు త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో గత బడ్జెట్‌ సమావేశాలను కూడా కుదించాల్సి వచ్చింది. సమావేశాలను వర్చ్యువల్‌ విధానంలో నిర్వహించాలని ఉభయ సభల్లోనూ చాలామంది కోరారు. వీరిలో అన్ని పార్టీలకు చెందిన సభ్యులున్నారు. పార్లమెంటు సమావేశాల కో సం కరోనా విషయంలో రిస్క్‌ తీసుకోలేమని స్పష్టం చే శారు.

కేసులు అధికంగా నమోదవుతున్న ఢిల్లీకి ప్ర యాణించడం, సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లాక అక్కడ క్వారంటైన్‌ నిబంధనలు పాటించడం తమ వల్ల కాద ని వాదించారు. దీనికి ప్రత్యామ్నాయంగా వర్చ్యువల్‌ సమావేశాలను ఏర్పాటుచేయాలని రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌లను అభ్యర్థించారు. వీటన్నిటి నేపథ్యం లో సభాధిపతులు వర్చ్యువల్‌ సమావేశాల వైపు మొ గ్గుచూపే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే.. రాష్ట్రాల అసెంబ్లీలు, విధానమండళ్లు కూడా వర్చ్యువల్‌ సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.