విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలి.సిపి

ఉత్తమ సేవలను గుర్తిస్తూ రివార్డులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా జులై 17

మావోయిస్టులు లేరనే ఉదాసీనత ఉండకుండా స్పెషల్ పార్టీ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఐపిఎస్ సూచించారు. రాష్ట్ర డిజిపి ఏం మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న స్పెషల్ పార్టీ సిబ్బందికి విధుల్లో ఉత్తమ సేవలను గుర్తిస్తూ రివార్డులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు పనిచేయాలన్నారు. విధుల పట్ల అంకిత భావంతో పనిచేసే సిబ్బందికి గుడ్ సర్వీస్ ఎంట్రీ, మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీ ఇస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో లాండ్ ఆర్డర్స్ డ్యూటీలో ఉన్న సమయంలో స్పెషల్ పార్టీ వారందరూ అత్యుత్తమ గా విధులు నిర్వహించారని కొనియాడారు.

s s consultancy

Also Read: సమస్యలను సత్వరమే పరిష్కరించాలి -మంత్రి కొప్పుల

అత్యుత్తమంగా పని చేసి తెలంగాణ పోలీస్ శాఖకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సిబ్బంది ఆదర్శంగా నిలిచారన్నారు.ఏవైన సమస్యలు ఉంటే ఓఎస్డీ కి తెలపాలని. సిబ్బంది క్షేమం, శ్రేయస్సు, అవసరాలు తీర్చడానికి అధికారులు ఎప్పుడూ అండగా ఉంటారని సిపి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్డి చంద్ర పవర్, ఏఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, ఏఆర్ ఎ సి పి సుందర్ రావు, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, స్వామి, ఆర్ఐలు మధుకర్, అనిల్, శ్రీధర్, విష్ణు‌ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రాజమౌళి, అర్ఎస్ఐలు రాజేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.