కేసీఆర్‌ డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారు

0
TMedia (Telugu News) :
s s consultancy


తెరాసతో ఉన్న 19 ఏళ్ల అనుబంధాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెంచుకున్నారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టంచేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నిసార్లు ఆదేశించినా రాజీనామా చేశానని…. తనకు పదవులు త్రుణప్రాయమన్నారు. ఎన్నికల బరిలో దిగిన ప్రతిసారి.. తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచివచ్చానని చెప్పారు. ఐదేళ్ల క్రితం నుంచే అవమానించడం ప్రారంభించారని… మంత్రినైన తనకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా… తన వివరణ తీసుకోకుండానే మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేశారని ఈటల వాపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్‌… ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చని… అంతిమవిజయం ధర్మానిదేనన్నారు. తనను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న హరీశ్‌రావుకు కూడా అవమానం జరిగిందని ఈటల వివరించారు. ప్రగతి భవన్‌ బానిసల నిలయంగా మారిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీ అధికారి కూడా లేరని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమంలో ఉన్నవారిని అణిచివేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఈటల విమర్శించారు.
” అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సీఎం ఎస్సీ అని చెప్పారు. సీఎంవో కార్యాలయంలో ఒక్క ఎస్సీనైనా, ఎస్టీనైనా ఉన్నారా? సీఎంవో కార్యాలయంలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి ఉన్నారా? ఆర్థిక శాఖ అ‌ధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీవోలు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రయోజనం కలిగించేలా అనేక సంఘాలు పెట్టించాం. బొగ్గు కార్మికులతో ఎలాంటి సంబంధం లేనివారు సంఘం నాయకులుగా ఉన్నారు. తెలంగాణ గడ్డమీద సంఘాలు, సమ్మెలు ఉండొద్దని కోరుకున్నారు.” – ఈటల రాజేందర్​
తెలంగాణలో సమ్మెలు చేస్తే సమస్యలు పరిష్కారం కావని ఈటల అన్నారు. రైతుబంధును ఆదాయ పన్ను చెల్లించేవారికి ఇవ్వొద్దని చెప్పానని, వ్యవసాయం చేయనివారికి రైతుబంధు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు. పొలం సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు ఇస్తే బాగుంటుందని సలహా ఇస్తే పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనే స్థాయి రైస్ మిల్లర్లకు లేదని, రాదని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.