రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి… ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

0
TMedia (Telugu News) :

రైతులు, డ్వాక్రా మహిళలు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు కోరారు. బుధవారం జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వారి సహకారంతో కృష్ణా ఫార్మర్స్ సర్వీసెస్ కో అపరేటివ్ సొసైటీ, జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కౌలు రైతులు, డ్వాక్రా మహిళలకు రూ. 1.60 కోట్ల రూపాయల రుణాల మంజూరు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా జగ్గయ్యపేట కృష్ణా ఫార్మర్స్ సర్వీసెస్ కో అపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ఎన్నికైన జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి గ్రామానికి చెందిన తుమాటి నాగేశ్వరరావు ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారిని జగ్గయ్యపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పూలమాలలు, శాలువతో ఘనంగా సత్కరించారు.

s s consultancy

State government whip and Jaggayyapeta legislator Saminee Udayabhanu urged farmers and Dwakra women to take advantage of loans provided by the state government through banks.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.